మేడారం వనదేవతలను దర్శించుకున్న మంత్రి సీతక్క..

తాడ్వాయి (ఆంధ్రప్రభ): ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలోని సమ్మక్క–సారలమ్మ వనదేవతలను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క) గురువారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావుతో కలిసి ఆలయానికి చేరుకున్న మంత్రికి పూజారులు సంప్రదాయబద్ధంగా డోలు వాయిద్యాలతో గద్దెల వద్ద ఘన స్వాగతం పలికారు. అనంతరం తల్లులకు పసుపు, కుంకుమ, బెల్లం, సారె, నూతన వస్త్రాలు సమర్పించి, కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

పూజల అనంతరం మేడారంలో కొనసాగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని మంత్రి పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి లెనిన్ వత్సల్ టోప్పో, జిల్లా అటవీ అధికారి వికాస్ మీనా, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) సంపత్‌రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ రేగ కళ్యాణి, మేడారం ట్రస్ట్ బోర్డు చైర్‌పర్సన్ సుకన్య సునీల్ దొర, సర్పంచ్ పీరీల భారతి వెంకన్న, ఉపసర్పంచ్ అలకుంట వనిత కృష్ణ, మండల అధ్యక్షుడు మంకిడి నరసింహస్వామి, మాజీ అధ్యక్షుడు బొల్లు దేవేందర్ ముదిరాజ్, మాజీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ అరేం లచ్చు పటేల్, సర్పంచ్‌లు కృష్ణ, వెంకటేశ్వర్లు, పూజారులు జగ్గారావు, రఘుపతిరావు, వెంకటేశ్వర్లు, రానా రమేష్, కొక్కెర రమేష్, మహేష్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.