bonalu| గోల్కొండ బోనాలకు ఆహ్వానం

bonalu| గోల్కొండ బోనాలకు ఆహ్వానం

గోల్కొండ శ్రీ జగదాంబ మహంకాళి ఆలయ బోనాల మహోత్సవాలకు ఆహ్వాన పత్రిక అందజేత
మంత్రి కొండా సురేఖతో పాటు దేవాదాయ శాఖ అధికారులు, ఆలయ ప్రతినిధులు సీఎంను కలిసిన వేళ

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : గోల్కొండ శ్రీ జగదాంబ మహంకాళి దేవాలయంలో నిర్వహించనున్న బోనాల మహోత్సవాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆలయ ప్రతినిధులు అధికారికంగా ఆహ్వానించారు. మంత్రి కొండా సురేఖ, దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, ఆలయ కార్యనిర్వాహణాధికారి (ఈవో), ప్రధాన అర్చకులు, ధర్మకర్తల మండలి సభ్యులు ముఖ్యమంత్రిని కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. బోనాల మహోత్సవాలకు హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించాలని ఈ సందర్భంగా సీఎంను కోరారు.