డ్రగ్స్ కేసులో ఎమ్మెల్సీ కుమారుడు అరెస్ట్? హైదరాబాద్‌లో కలకలం
డ్రగ్స్ కేసులో ఎమ్మెల్సీ కుమారుడు అరెస్ట్? హైదరాబాద్‌లో కలకలం
మంగళ్‌హాట్‌లో అర్ధరాత్రి పోలీసుల దాడి..
ముగ్గురు అదుపులోకి తీసుకున్నట్లు ప్రచారం
హైదరాబాద్, ఆంధ్రప్రభ: హైదరాబాద్‌లోని మంగళ్‌హాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రగ్స్ కేసుకు సంబంధించి ఓ ప్రముఖ రాజకీయ నాయకుడి కుమారుడి పేరు తెరపైకి వచ్చినట్లు తెలుస్తోంది. మంగళ్‌హాట్ ప్రాంతంలో పక్కా సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించి, ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అదుపులోకి తీసుకున్న వారిలో ప్రతిపక్ష పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్సీ కుమారుడు భరత్ ఉన్నట్లు సామాజిక మాధ్యమాలు, రాజకీయ వర్గాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. పోలీసులు నిర్వహించిన పరీక్షల్లో డ్రగ్స్ సేవించినట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు కూడా ప్రచారం సాగుతోంది.
ఇదిలా ఉండగా, ఈ కేసులో నమోదుకాకుండా చేయాలంటూ ఓ కీలక మంత్రి స్థాయిలో ఒత్తిళ్లు వస్తున్నాయనే వార్తలు కూడా చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ అంశంపై హైదరాబాద్ పోలీసులు ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. అలాగే అరెస్టు, కేసు నమోదు, డ్రగ్స్ పరీక్షల ఫలితాలపై కూడా అధికారిక నిర్ధారణ వెలువడాల్సి ఉంది.
