గీసుకొండలో ‘కన్వర్షన్’ రాజకీయం
- రేవూరి వర్గంలోకి కొండా అనుచరులు
- అభివృద్ధి కోసమే వర్గం మారామన్న సర్పంచ్ యమున–ప్రవీణ్ దంపతులు
- ఎమ్మెల్యే సమక్షంలో కొమ్మాల సర్పంచ్, ఏడుగురు వార్డు సభ్యుల చేరిక
గీసుకొండ, ఆంధ్రప్రభ : గీసుకొండ మండలంలో ‘కన్వర్షన్’ రాజకీయం చోటుచేసుకుంది. నిన్నటివరకు నియోజకవర్గంలో కొండా వర్గంలో కీలకంగా కొనసాగిన కొమ్మాల సర్పంచ్ కన్నెబోయిన యమున–ప్రవీణ్ దంపతులు తాజాగా పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి వర్గంలో చేరారు.
బుధవారం కొమ్మాల సర్పంచ్ దంపతులతో పాటు ఏడుగురు వార్డు సభ్యులు, వివిధ పార్టీలకు చెందిన ముఖ్య నాయకులు కొండా వర్గాన్ని వీడి ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి సమక్షంలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి కండువాలు కప్పి, పుష్పగుచ్ఛాలు అందించి సాదరంగా ఆహ్వానించారు.
అంతకుముందు కొమ్మాల స్టేజీ నుంచి గ్రామ పంచాయతీ వరకు మహిళల కోలాటాలు, డప్పు చప్పుళ్ల నడుమ ఎమ్మెల్యే రేవూరికి ఘన స్వాగతం పలికారు. భారీ ర్యాలీ నిర్వహించి గ్రామంలో సందడి చేశారు.
అభివృద్ధి కోసమే వర్గం మార్పు
ఈ సందర్భంగా సర్పంచ్ కన్నెబోయిన యమున–ప్రవీణ్ దంపతులు మాట్లాడుతూ.. కొమ్మాల గ్రామ సమగ్ర అభివృద్ధిని ఆకాంక్షించే కొండా వర్గం నుంచి రేవూరి వర్గంలోకి మారినట్లు స్పష్టం చేశారు. స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి నాయకత్వంలో గ్రామానికి నిధులు వస్తాయని, అన్ని రంగాల్లో ప్రగతి సాధిస్తుందనే నమ్మకంతోనే ఏడుగురు వార్డు సభ్యులతో కలిసి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
కొమ్మాల అభివృద్ధికి సంపూర్ణ సహకారం
ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి మాట్లాడుతూ.. కొమ్మాల గ్రామ సమగ్ర అభివృద్ధికి తనవంతు సంపూర్ణ సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. స్థానిక ఎమ్మెల్యేకు అండగా ఉంటే గ్రామాలు వేగంగా అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం కొనసాగుతోందని, రాజకీయాలకు అతీతంగా గ్రామాల అభివృద్ధే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.
తాను ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి నిత్యం ప్రజల మధ్య ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. పార్టీలతో సంబంధం లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ ముఖ్యమంత్రి సహాయనిధి, కల్యాణలక్ష్మి వంటి సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
ధనిక రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారు
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ తీరుపై ఎమ్మెల్యే రేవూరి విమర్శలు గుప్పించారు. స్వయం పాలన, నీళ్లు, నిధులు, నియామకాల ఆకాంక్షతో ఎందరో చేసిన త్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. అయితే గత పాలకులు స్వయం పాలనను కుటుంబ పాలనగా మార్చి, ధనిక రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని ఆరోపించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దాడి శివ,జిల్లా ప్రధాన కార్యదర్శి తుమ్మనపల్లి శ్రీనివాస్, కొండేటి కొమురరెడ్డి, చాడ కొమురరెడ్డి, భీమాగాణి సౌజన్య, ఎ యం సి డైరెక్టర్ రుద్ర ప్రసాద్,దూల వెంకటేశ్వర్లు, రవీందర్, రమేష్, గోపాల్, క్రాంతి, శ్రీకాంత్,సరిత, రాధికా, ప్రభాకర్, రాజు, రాజయ్య, ఎడ్ల బాబు వార్డ్ సభ్యులు తంగేలపల్లి యశ్వంత్,గుల్లపెళ్లి నవీన, జూలూరి సుమన్, ఈర్ల అనూష, మండల రవి,బట్టమేకల కోమల,బసికె మణి, బట్టమేకల స్వరూప,సాయిలి శ్రీను, జక్కుల రవి, కొండo అనిల్, అశోక్, మామూనూరి కొమురయ్య, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
