Spain-Beat-2-0-France‍ : రెడ్​ ఫ్యూరీ ,, టికిటకా.Andhra prabha Sports Story.

Spain-Beat-2-0-France‍ : రెడ్​ ఫ్యూరీ ,, టికిటకా.Andhra prabha Sports Story.

  • ఫ్రాన్స్​ విలవిల
  • 2-0 తేడాతో స్పెయిన్​ సూపర్​ విక్టరీ
  • ఫిఫా ఫైనల్​ పోరులో… లా రోజా

( ఆంధ్రప్రభ, క్రీడాప్రతినిధి )

ఫిఫా 2026 వరల్డ్​ కప్​ టోర్నీలో హాట్​ ఫేవరేట్​ గా చెలరేగిన ఫ్రాన్స్​ కు స్పెయిన్​ చుక్కలు చూపించింది. ఈ మ్యాచ్​ లో బ్లూ టీమ్​ పై రెడ్​ డెవిల్​ తన ఉగ్ర తాండవం రుచి చూపించారు. కేవలం గాలిక్​ రోస్టర్ల వ్యక్తిగత ప్రతిభపై ఆధారపడిన ప్రాన్స్​ కు స్పెయిన్​ జట్టు ఓ గుణపాఠం చెప్పింది. సమన్వయం, కచ్చిత పాసింగ్ డిఫెన్సివ్ క్రమశిక్షణతో మైదానంలో పరుగులు తీస్తే.. ఆ బంతి తమ కాళ్లకు దరి చేరాల్సిందే. గాలిలో ఎగిరి గెల్​ పోస్టులో దూసుకు పోక తప్పదని స్పెయిన్​ జట్టు నిరూపించింది. ఫీఫా ప్రపంచ కప్ 2026 సెమీఫైనల్‌లో స్పెయిన్ ఒక అద్భుత వ్యూహాత్మక మాస్టర్‌ క్లాస్‌తో ఫ్రాన్స్‌ను 2-0 తేడాతో స్పెయిన్​ మట్టికరిపించింది. అ . టోర్నమెంట్‌లో అత్యంత ప్రమాదకర ఫార్వర్డ్ లైన్ కలిగిన ఫ్రాన్స్‌ను, తన పటిష్ట డిఫెన్స్ మిడ్‌ఫీల్డ్ నియంత్రణతో ఒక్క షాట్ కూడా గోల్ పోస్ట్‌పైకి కొట్టనివ్వకుండా కట్టడి చేసింది. ఫ్రాన్స్‌ను మైదానంలో కంగుతినిపించిన ప్రధాన వ్యూహాలు ఇవే:

Spain-Beat-2-0-France‍ : బలహీనతే టార్గెట్

మ్యాచ్‌కు ముందే ఫ్రాన్స్ లెఫ్ట్-బ్యాక్ లూకాస్ డిగ్నే రక్షణలోని లోపాలను స్పెయిన్ కోచ్ లూయిస్ డి లా ఫ్యూయెంటె గుర్తించారు.స్పెయిన్ రైట్ వింగర్ లామిన్ యమాల్ తన వేగవంత పరుగులతో డిగ్నేను నిరంతరం ఒత్తిడిలోకి నెట్టాడు. మొదటి గోల్‌కు కారణమైన పెనాల్టీ ఇలాంటి ఒక పరుగులోనే లభించింది. యమాల్‌ను డిగ్నే బాక్స్‌లో కిందపడేయడంతో, లభించిన పెనాల్టీని మైకెల్ ఓయార్జాబల్ గోల్‌గా మాలిచాడు .రెండో హాఫ్‌లో రైట్-బ్యాక్ పెడ్రో పోరో కూడా ముందుకు దూసుకొస్తూ, డాని ఓల్మోతో అద్భుత ‘వన్-టూ’ పాసింగ్ గేమ్‌తో ఫ్రాన్స్ డిఫెన్స్‌ను చేధించి రెండో గోల్ సాధించాడు.

Spain-Beat-2-0-France‍ : ఎంబాప్పే దిగ్బంధనం

ఫ్రాన్స్ కెప్టెన్, ప్రపంచ అత్యుత్త స్ట్రైకర్ కైలియన్ ఎంబాప్పేను కదలకుండా చేయడంపైనే స్పెయిన్ విజయం ఆధారపడింది.స్పెయిన్ యువ సెంటర్-బ్యాక్ పావు కుబార్సి చాలా తెలివిగా పొజిషనింగ్ తీసుకుంటూ ఎంబాప్పేకు బంతి అందనీయలేదు, వేగంగా ముందుకు పరిగెత్తేందుకు ఎంబాప్పే ప్రయత్నం చేసిన ప్రతిసారీ స్పెయిన్ పక్కా ‘హై-లైన్ డిఫెన్స్’ వ్యూహం వల్ల అతను పదే పదే ఆఫ్‌సైడ్‌గా దొరికిపోయాడు. లెఫ్ట్-బ్యాక్ మార్క్ కుకురెల్లా మ్యాచ్ డిఫైనింగ్ ప్రదర్శన చేశాడు. ఎంబాప్పే కొట్టిన ఒక ప్రమాదకర షాట్‌ను అతను డిఫ్లెక్ట్ చేయడమే కాకుండా, చివరి నిమిషంలో బాక్స్ లోపల అద్భుత బ్లాక్‌తో ఫ్రాన్స్‌కు గోల్ దక్కనీయలేదు.

Spain-Beat-2-0-France‍ : మిడ్‌ఫీడ్లర్ల షాక్​

స్పెయిన్ మిడ్‌ఫీల్డ్ జనరల్ రోడ్రి , ఫాబియన్ రూయిజ్ కలిసి మ్యాచ్ టెంపోను పూర్తిగా తమ ఆధీనంలోకి లాక్కున్నారు. బంతిని తమ వద్దే ఉంచుకుంటూ ఫ్రాన్స్ మిడ్‌ఫీల్డర్లకు బంతిని పాస్ చేసే అవకాశాన్ని ఇవ్వలేదు. ఫ్రాన్స్ క్రియేటివ్ లింక్ మైఖేల్ ఒలిసేకు కనీసం బంతిని అందుకునే స్పేస్ ఇవ్వకుండా రోడ్రి హై-ప్రెసింగ్ గేమ్‌తో ఊపిరాడకుండా చేశాడు. ఫ్రాన్స్ అటాకింగ్ ముగ్గురు ఆటగాళ్లు ఐసోలేట్ అయిపోయారు.

Spain-Beat-2-0-France‍ : గాయంతో సలిబా షాక్​

మొదటి హాఫ్ 30వ నిమిషంలోనే ఫ్రాన్స్ స్టార్ డిఫెండర్ విలియం సలిబా గాయపడి మైదానాన్ని వీడడం కూడా స్పెయిన్‌కు కలిసి వచ్చింది. అతని స్థానంలో వచ్చిన మాక్సెన్స్ లాక్రోయిక్స్ స్పెయిన్ వేగవంత పాసింగ్ గేమ్‌ను అడ్డుకోవడంలో విఫలమయ్యాడు. ఫ్రాన్స్ ఆటగాళ్ల వ్యక్తిగత నైపుణ్యాల పై ఆధారపడగా, స్పెయిన్ మాత్రం తిరుగులేని జట్టు సమన్వయం, కచ్చిత పాసింగ్ డిఫెన్సివ్ క్రమశిక్షణతో మైదానంలో ఫ్రాన్స్‌ను చేష్టలుడిగేలా స్పెయిన్​ అద్భుత చరిత్రను సృష్టించింది.ఈ సూపర్​ విక్తరీతో స్పెయిన్ 16 ఏళ్ల తర్వాత మళ్లీ ఫీఫా వరల్డ్ కప్ ఫైనల్‌కు చేరుకుంది. జూలై 19న న్యూయార్క్‌లో జరగబోయే ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ లేదా అర్జెంటీనా విజేతతో స్పెయిన్ తలపడనుంది