కోయిలకొండలో వ్యక్తి అదృశ్యం
కోయిలకొండ, ఆంధ్రప్రభ: నారాయణపేట జిల్లా కొత్తపల్లి మండలం నందిగామ గ్రామానికి చెందిన హనుమంతు నాయక్ కోయిలకొండ మండల కేంద్రంలో అదృశ్యమైనట్లు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసినట్లు ఎస్సై నాగరాజ్ తెలిపారు.
పోలీసుల వివరాల ప్రకారం.. హనుమంతు నాయక్ సోమవారం శరీర నొప్పులకు చికిత్స కోసం కోయిలకొండలోని ఓ ఆర్ఎంపీ వైద్యుడి వద్దకు వచ్చారు. సాయంత్రం సుమారు 5.30 గంటల సమయంలో వైద్య సలహాలు తీసుకున్న అనంతరం ఆయన ఆచూకీ తెలియకుండా పోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై నాగరాజ్ వెల్లడించారు. హనుమంతు నాయక్ ఎక్కడైనా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.
