రేపు చౌటుప్పల్‌లో ఆరు గంటల విద్యుత్ అంతరాయం

చౌటుప్పల్, ఆంధ్రప్రభ: చౌటుప్పల్ సబ్‌స్టేషన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో బుధవారం (జూలై 15) విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు విద్యుత్ శాఖ చౌటుప్పల్ ఏఈ రాజుల సతీష్ తెలిపారు.

33/11 కేవీ చౌటుప్పల్ సబ్‌స్టేషన్‌లో అత్యవసర మరమ్మత్తు పనులు చేపట్టనున్న నేపథ్యంలో ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని ఆయన వెల్లడించారు.

విద్యుత్ సరఫరా నిలిచే ప్రాంతాలు:

  • చౌటుప్పల్ పట్టణ పరిధి
  • లింగోజిగూడెం వ్యవసాయ ఫీడర్ పరిధి
  • జిబ్లాక్‌పల్లి వ్యవసాయ ఫీడర్ పరిధి
  • చిన్నకొండూరు వ్యవసాయ ఫీడర్ పరిధి

ప్రభావిత ప్రాంతాల వినియోగదారులు, రైతులు ముందస్తుగా అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని, మరమ్మత్తు పనులు సజావుగా సాగేందుకు విద్యుత్ శాఖ సిబ్బందికి సహకరించాలని ఏఈ రాజుల సతీష్ విజ్ఞప్తి చేశారు.