3-Greenfield-Ports : తీర ప్రాంతాలకు తీపి కబురు Andhra Prabha Top News
3-Greenfield-Ports : తీర ప్రాంతాలకు తీపి కబురు Andhra Prabha Top News
- 3 గ్రీన్ ఫీల్డ్ పోర్టుల విప్తరణకు ఓకే
- ఫేజ్-2 బూసేకరణకు గ్రీన్ సిగ్నల్
- 6,248.54 ఎకరాలపై ఫోకస్
- రూ. 1638.52 కోట్లు మంజూరు
- రామాయపట్నంలో 2924.45 ఎకరాలు
- మూలాపేటకు 1903.39 ఎకరాలు
- మూలాపేటలో ఉప్పు భూముల సేకరణ
- ఆర్ & ఆర్ పనుల నిర్వహణ
- మచిలీపట్నం పోర్డుకు 420.70 ఎకరాలు
- తిరుపతి జిల్లాలో ఎన్ఐఎల్ పీ కి 63.01. ఎకరాలు
- రూ. 255 కోట్ల పెట్టుబడులతో, 1000 మందికి ఉపాధి
- మంత్రి జనాథనరెడ్డి వెల్లడి
( ఆంధ్రప్రభ, అమరావతి )
Ap-Greenfield-Ports : ఏపీలో తీరప్రాంత అభివృద్ధిలో భాగంగా భవిష్యత్తు అవసరాలు, పోర్టుల విస్తరణను దృష్టిలో ఉంచుకుని, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు 3 గ్రీన్ ఫీల్డ్ పోర్టుల అభివృద్ధికి ఫేజ్ 2 లో భాగంగా భూసేకరణకు ఆమోదం తెలిపినట్లు రాష్ట్ర పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి తెలిపారు. రామాయపట్నం, మూలాపేట, మచిలీపట్నం గ్రీన్ ఫీల్డ్ పోర్టుల రెండో దశ విస్తరణకు మొత్తంగా 6,248.54 ఎకరాల భూసేకరణకు దాదాపు రూ. 1638.52 కోట్ల నిధులకు పరిపాలనా అనుమతులు మంజూరు చేసినట్లు సచివాలయంలోని R&B, I&I శాఖ కార్యాలయంలో మంత్రి వెల్లడించారు.
మచిలీపట్నం గ్రీన్ ఫీల్డ్ పోర్టు ఫేజ్ 2 అభివృద్ధిలో భాగంగా 1420.70 ఎకరాల భూసేకరణకు దాదాపు రూ. 347 కోట్ల నిధులకు పరిపాలనా అనుమతులు ఇచ్చినట్లు తెలిపారు.
మూలాపేట గ్రీన్ ఫీల్డ్ పోర్టు ఫేజ్ 2 అభివృద్ధిలో భాగంగా 1903.39 ఎకరాల భూసేకరణకు దాదాపు రూ. 440.52 కోట్ల నిధులకు పరిపాలనా అనుమతులు ఇచ్చామన్నారు.. ఉప్పు భూములు (SALT LANDS) తో కలిపి దాదాపుగా ఈ 1903 ఎకరాల భూముల్లో భూసేకరణ చేయనున్నామన్నారు. అలాగే ఆర్ & ఆర్ కూడా ఇందులోనే చేపట్టనున్నట్లు మంత్రి తెలిపారు.
రామాయపట్నం గ్రీన్ ఫీల్డ్ పోర్టు ఫేజ్ 2 అభివృద్ధిలో భాగంగా 2924.45 ఎకరాల భూసేకరణకు దాదాపు రూ. 851 కోట్ల నిధులకు పరిపాలనా అనుమతులు ఇచ్చామన్నారు.
తిరుపతి జిల్లా సత్యవేడు మండలం చిన్న ఈటివాకం గ్రామంలో ఇంటిగ్రేటేడ్ లాజిస్టిక్స్ పార్క్ ఏర్పాటుకు 63.01 ఎకరాలు కేటాయించినట్లు పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి వెల్లడించారు…నెక్సస్ ఇంటిగ్రేటేడ్ లాజిస్టిక్స్ పార్క్ సంస్థ ప్రతిపాదనల మేరకు ఏపీ మారిటైమ్ బోర్డు ద్వారా భూమి కేటాయింపులు చేయనున్నట్లు మంత్రి తెలియజేశారు. నెక్సస్ ఇంటిగ్రేటేడ్ లాజిస్టిక్స్ పార్క్ సంస్థ స్థానికంగా దాదాపు రూ. 255 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన క్రమంలో దాదాపు 63 ఎకరాల భూమిని సదరు సంస్థకు కేటాయించినట్లు మంత్రి తెలిపారు. ఈ లాజిస్టిక్స్ పార్క్ ఏర్పాటు ద్వారా స్థానికంగా వెయ్యి మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలగనున్నట్లు మంత్రి వివరించారు.
