షోబిల్లిన తెలుగు రచయిత్రుల వైభవం.
మరిన్ని సాహితీ సౌరభాలు వెల్లివిరియాలి..
సన్మాన గ్రహీత వేముల హాజరత్తయ్య గుప్తా.
పాయకాపురం, ఆంధ్రప్రభ : అంతర్జాతీయ తెలుగు రచయిత్రుల మహాసభలు విజయవాడ వేదికగా నిర్వహించడం చాలా అందంగా ఉందని, తద్వారా తెలుగు రచయిత్రుల వైభవం ప్రపంచానికి చాటిచెప్పాయని,అందులో తనను గౌరవించి సన్మానించడం ఆనందదాయకమని సాహితీ వేత్త, డాక్టర్ హాజరత్తయ్య గుప్తా అన్నారు.
రాజీవ్ నగర్ ప్రాంతంలోని గుప్తా కార్యాలయంలో మాట్లాడుతూ వన్ టౌన్ కె ల్.బి.ఎన్ కళాశాలలో నిర్వహించబడిన 3వ అంతర్జాతీయ తెలుగు రచయిత్రుల మహాసభలు మహిళ సాహితీ వేత్తల వివిధ కవితలు, పద్యాలు, సాహితీ రూపకాలు, భరత నాట్య ప్రదర్శనలతో సాహితీ వైభవం ఉట్టిపడేలా జరిగాయని ఆయన పేర్కొన్నారు. సాహితీ వేత్తలు, సాహితీ ప్రియులతో కళాశాల ఆవరణలో నాలుగు ప్రదేశాలలో కళ కళలాడిందని అన్నారు. ముగింపు సభకి యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అధ్యక్షత వహించగా, శాసన సభ్యుడు మండలి బుద్ధ ప్రసాద్, మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ, నారాయణ రావు, జి. సుబ్బా రావు,పూర్ణచంద్ తదితరులు పాల్గొని సాహితీ విలువలు పెరిగేలా కృషి చేయాలని పిలుపునివ్వడం అనేక రచయితలకు స్ఫూర్తిని ఇవ్వడం జరిగిందని తెలిపారు.ఈవేదికపై అంతర్జాతీయ రచయితలు, ప్రముఖులు తనను సన్మానించడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు.
