Rs.2.30 lakh | వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు

Rs.2.30 lakh | వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు

Rs.2.30 lakh | గన్నవరంఆంధ్రప్రభ : దేశం లోనే ఎక్కడ లేని విధం గా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం రాష్ట్రం లో జరుగుతుందని ఏపీ ప్రభుత్వ విప్ గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. శనివారం ఉదయం ఆయన ఉంగుటూరు మండలం కొయ్యగూరపాడు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు స్వయంగా అందజేసి, వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం గ్రామంలో రూ.2.30 లక్షల వ్యయంతో నిర్మించిన గోకులం షెడ్డును ప్రారంభించారు. అక్కడి నుండి పొణుకుమాడు గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్యే, తానా సెక్రటరీ కసుకుర్తి రాజాతో కలిసి ఎన్ఆర్ఐ తానా తరఫున రైతులకు 10 లక్షల రూపాయల విలువైన స్ప్రేయర్లు, టార్పాలిన్ పట్టాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాల్లో కూటమి నాయకులు, అధికారులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.

Rs.2.30 lakh |

ఈ సందర్భంగా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ, ప్రతి నెలా ఒకటవ తేదీన అధికారులు, స్థానిక నాయకులతో కలిసి పెన్షన్లను ఇంటింటికి వెళ్లి అందజేస్తున్నామని తెలిపారు. ఒకటవ తేదీ ఆదివారం కావడంతో, లబ్ధిదారులకు ఇబ్బంది కలగకుండా శనివారమే ఈ పంపిణీ చేపట్టామని చెప్పారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పటికీ, ప్రజా సంక్షేమమే పరమావధిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు గ్రామాల్లో పెన్షన్ల పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు.

Rs.2.30 lakh |

గన్నవరం నియోజకవర్గంలో మొత్తం 47,406 మంది లబ్ధిదారులకు 20 కోట్ల 38 లక్షల 66 వేల రూపాయల మొత్తాన్ని పెన్షన్ల రూపంలో అందజేసినట్లు వివరించారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో నియోజకవర్గాన్ని నిలువుదోపిడీ చేశారని ఆయన విమర్శించారు. గత ప్రభుత్వ హయంలో గన్నవరం, బాపులపాడు మండలాలకు ఒకే తాసిల్దార్ ఉండటంతో అధికారం దుర్వినియోగం అయిందని, రెవిన్యూ రికార్డుల్లో భారీగా ట్యాంపరింగ్ జరిగిందని ఆరోపించారు.

Rs.2.30 lakh |

గన్నవరంలో ప్రస్తుత ఎమ్మార్వో కబ్జా కోరల నుండి 35 ఎకరాల ప్రభుత్వ భూమిని రికవరీ చేయడం అభినందనీయమన్నారు. నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా రూరల్ ప్రాంతానికి సర్కిల్ ఇన్స్పెక్టర్ కేటాయింపునకు సీఎం నుండి అంగీకారం లభించిందని, డీసీపీ మురళి మరియు స్థానిక తాసిల్దార్లతో స్థల పరిశీలనపై చర్చించామని తెలిపారు. రాబోయే రోజుల్లో నున్న పోలీస్ స్టేషన్‌ను ఎస్హెచ్ఓ పరిధిలోకి తీసుకురావడానికి, రామవరప్పాడులో సర్కిల్ కార్యాలయం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.

గన్నవరంలో త్వరలోనే అన్న క్యాంటీన్‌ను ప్రారంభిస్తామని, రామవరప్పాడులో కూడా క్యాంటీన్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రిని కోరినట్లు ఎమ్మెల్యే తెలిపారు. నైనవరంలో కృష్ణా యూనివర్సిటీని, ఎయిర్‌పోర్ట్ ఎదురుగా ఉన్న ప్రభుత్వ భూమిలో కేంద్ర ప్రభుత్వ సంస్థ సీ-డాక్ (C-DAC)ను తీసుకురావడానికి కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.

నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా నిరంతరం పనిచేస్తానని యార్లగడ్డ వెంకట్రావు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఉంగుటూరు మండల టిడిపి అధ్యక్షులు కొలుసు రవీంద్ర, విజయవాడ రూరల్ మండల టిడిపి అధ్యక్షులు గొడ్డళ్ల చిన్న రామారావు, గన్నవరం వ్యవసాయ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ కొండేటి వెంకటేశ్వరరావు, సుంకర రాజేష్, సుంకర రాజేంద్రప్రసాద్, కొండ రాంబాబు, కొలవేంటి నాగబాబు, మండల టిడిపి ప్రధాన కార్యదర్శి కుందేటి చంద్రశేఖర్, బోడపాటి రవికుమార్, మేడేపల్లి రమ, తుమ్మల లత, పోతినేని రామకృష్ణ, దాసరి వెంకట బాపినీడు, కొరివి మాధవి, కొణిజేటి సాంబయ్య, కొల్లిపల్లి జైపాల్, పాతూరు రత్నాకర్, దాసరి నాగేంద్ర, తుమ్మల జగదీష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply