అరుణోదయ నాగన్న జీవితం యువతకు ఆదర్శం: కొట్టం అంజయ్య
కేసముద్రం, ఆంధ్రప్రభ : ప్రజా గాయకుడు అరుణోదయ నాగన్న జీవితం నేటి యువతకు ఆదర్శనీయమని సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ ఎస్డీఎల్సీ కార్యదర్శి కొట్టం అంజయ్య అన్నారు.
జూలై 25న హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించనున్న అరుణోదయ నాగన్న సంతాప సభ పోస్టర్‌ను మంగళవారం కేసముద్రం వ్యవసాయ మార్కెట్ ఆవరణలో ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభలో కొట్టం అంజయ్య మాట్లాడుతూ, నాగన్న ఐదు దశాబ్దాలపాటు పీడిత ప్రజల హక్కుల కోసం, విప్లవోద్యమం కోసం తన జీవితాన్ని అంకితం చేశారని కొనియాడారు.
జూలై 25న జరిగే సంతాప సభకు అభిమానులు, కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, మేధావులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సబ్‌డివిజన్ నాయకులు బొమ్మగాని వెంకన్న, ఏఐకేఎంఎస్ నాయకులు అంబటి నాగమల్లు, ఐఎఫ్టీయూ నాయకులు మిట్ట గడుపుల వెంకన్న, పిన్నోజు చంద్రమౌళి, కాసు సూరయ్య, చిట్ల సంజీవ్, ఆదినారాయణ, పీర్నాకి శ్రీను, ముత్యాల ఉపేందర్, గుండెల సురేష్ తదితరులు పాల్గొన్నారు.
