భారీ వర్షాలకు దెబ్బతిన్న రహదారులు..
- నెలలు గడుస్తున్నా మరమ్మత్తుకు నోచుకోని వైనం..
- పట్టించుకోని ప్రజాప్రతినిధులు అధికారులు..
రేగొండ, ఆంధ్రప్రభ : గత ఏడాది కురిసిన భారీ వర్షాలకు రేగొండ మండలంలో రోడ్లు దెబ్బతిన్నాయి. రేగొండ మీదుగా రావులపల్లి వెళ్ళే ప్రధాన రహదారి, వర్షానికి కొట్టుకు పోయి సంవత్సరాలు గడిచినా కనీస మరమ్మతులు చేయడం లేదు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
భారీ వర్షం పడితే చాలు నారాయణపూర్ నుండి రావుల పల్లి మద్య కల్వర్టు పోయి రోడ్డు తెగిపోతుంది. రెండు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోతున్నాయి. ఆయా గ్రామాల సర్పంచ్ లు కల్వర్టు తెగిన ప్రతీసారి తాత్కాలిక మరమ్మతు చేస్తున్నారు. వర్షం పడ్డ ప్రతీసారి ఇదే పరిస్థితులు ఎదురవుతుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మండలంలోని ప్రతి ఏడాది వర్షం కారణంగా రహదారులు వరద నీరు రోడ్డుపై నుంచి ప్రవహించడంతో సగం వరకు కొట్టుకుపోతున్నాయి. ప్రస్తుతం ఒక వైపు నుంచే వాహనదారులు వెళుతున్నారు.
గత సంవత్సరం కురిషిన భారీ వర్షాలకు రావుల పల్లి నుంచి పాండవుల గుట్టల వరకు అక్కడక్కడ కొట్టుక పోయి సగం వరకు దెబ్బతింది. దీంతో అధికారులు ఈ సంవత్సరం వర్షాకాలం ముందు మరమ్మతు చేస్తారని అనుకున్న మేర పనులు జరగక పోవడం వల్ల ఆ గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
మాళ్లి ఈ సంవత్సరం వర్షాలు కురీస్తే పూర్తిగా కోట్టుక పోతుందని. బయపడుతున్నారు.రోడ్డు కొట్టుకు పోతే నాలుగు నుండి వారం రోజుల వరకు రాకపోకలకు ఇబ్బంది ఏర్పడుతుందని ఆందోళన చెందుతున్నారు. ఈ మార్గం గుండానే చాలా మంది పాండవుల గుట్టకు వెళుతుంటారు. ఇప్పుడున్న రోడ్డును చూసి ప్రజలు జంకుతున్నారు.రాత్రి పగలు రహదారి పై వెళుతుంటామని ఆదమరచి వెళితే ఎలాంటి ప్రమాదం జరుగుతుందో అని బయపడుతున్నారు. ఇలా చాలా వరకు మండలంలో రోడ్లు దెబ్బతిన్నాయి. ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేయాలని మండల ప్రజలు కోరుతున్నారు.
