ఎరువు దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు..
నిబంధనలు పాటించని వారిపై చర్యలు
మండల వ్యవసాయ అధికారి కళ్యాణి
టేకుమట్ల, ఆంధ్రప్రభ : రైతులకు నాణ్యమైన ఎరువులు అందేలా చర్యలు చేపడుతున్న నేపథ్యంలో మండల వ్యవసాయ అధికారి కళ్యాణి ఆధ్వర్యంలో మంగళవారం మండల పరిధిలోని వినయ్ ఫర్టిలైజర్, కిసాన్ ట్రేడర్స్ వెంకటేశ్వర ట్రేడర్స్ తోపాటు పలు ఎరువు దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. వారు సదరు ఎరువులకు సంబంధించిన జీరో ఫామ్ లను లైసెన్స్ నందు పొందుపరచక పోవడం సరైన పత్రాలు సమర్పించకపోవడం స్టాక్ బోర్డులను ప్రదర్శించకపోవడం గుర్తించడం జరిగిందని తెలిపారు షాపు యజమానులకు స్టాప్ సేల్స్ అమ్మకాల నిలిపివేత ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందన్నారు 21 రోజులు వరకు సరైన పత్రాలు సమర్పించిన యెడల స్టాఫ్ సేల్ను రీవోకు చేయడం జరుగుతుందన్నారు.
రైతులకు ప్రభుత్వ నిర్ణయించిన ధరలకే ఎరువులు విక్రయించాలని, ప్రతి విక్రయానికి తప్పనిసరిగా బిల్లు ఇవ్వాలని దుకాణదారులకు సూచించారు.అలాగే ఎరువులను ఇతర వస్తువులతో బలవంతంగా విక్రయించడం, కృత్రిమ కొరత సృష్టించడం, అధిక ధరలకు విక్రయించడం వంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని మండల వ్యవసాయ అధికారి హెచ్చరించారు.రైతులు ఎరువులు కొనుగోలు చేసే సమయంలో తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలని, ఏవైనా అక్రమాలు గమనించినట్లయితే వెంటనే వ్యవసాయ శాఖ అధికారులకు సమాచారం అందించాలని ఆమె కోరారు.ఈ తనిఖీల్లో వ్యవసాయ విస్తరణ అధికారులు, వ్యవసాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. ఫోటో రైట్ అప్ 1 ఎరువు దుకాణాలను తనిఖీలు చేస్తున్న మండల వ్యవసాయ అధికారి కళ్యాణి
