AP | ఓటర్లకు కీలక అప్డేట్…
AP | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్‌లో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్ఐఆర్ ప్రక్రియ గడువును పొడిగిస్తూ తాజా షెడ్యూల్‌ను వెల్లడించింది. ఏపీలో SIR గడువు ఈ నెల 24 వరకు పొడిగించింది. ఓటరు జాబితా సవరణ ప్రక్రియకు జూలై 31 వరకు గడువు పొడిగించినట్లు ఎన్నికల సంఘం పేర్కొంది. అదే రోజు ముసాయిదా ఓటరు జాబితాను విడుదల చేయనున్నట్లు తెలిపింది.
ముసాయిదా ఓటరు జాబితాలో పేర్లు, ఇతర వివరాలకు సంబంధించి అభ్యంతరాలు ఉంటే వాటిని తెలియజేసేందుకు ఓటర్లకు అవకాశం కల్పించనున్నారు. ఆగస్టు 30 వరకు అభ్యంతరాలు, క్లెయిమ్‌లను స్వీకరించనున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది.
అనంతరం అందిన అభ్యంతరాలు, దరఖాస్తులను అధికారులు పరిశీలించి పరిష్కరించనున్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత అక్టోబర్ 3న తుది ఓటరు జాబితాను విడుదల చేయనున్నట్లు ఎన్నికల సంఘం పేర్కొంది. అర్హులైన ఓటర్ల పేర్లు జాబితాలో ఉండేలా చూడటంతో పాటు వివరాల్లో తప్పులు ఉంటే సరిచేసుకునేందుకు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఎన్నికల అధికారులు సూచిస్తున్నారు.
