లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ

భీమ్‌గల్, ఆంధ్రప్రభ: భీమ్‌గల్ మండలం మెండోరా గ్రామానికి చెందిన కల్లెడ మమత, కల్లెడ రవికుమార్‌లకు ప్రభుత్వం మంజూరు చేసిన ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్) చెక్కులను బీజేపీ భీమ్‌గల్ మండల అధ్యక్షుడు అరె రవీందర్ మంగళవారం అందజేశారు.

ఈ సందర్భంగా అరె రవీందర్ మాట్లాడుతూ, అనారోగ్యంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుపేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సాయం అందేలా కృషి చేస్తున్నామని తెలిపారు. భీమ్‌గల్ మండలంలో ప్రజలకు అవసరమైన సమయంలో అండగా నిలుస్తూ, ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. బీజేపీ బాల్కొండ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ ఏలేటి మల్లికార్జున్‌రెడ్డి, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ నాయకత్వంలో ప్రజాసేవకు కట్టుబడి పనిచేస్తున్నామని చెప్పారు.

ఈ కార్యక్రమంలో మెండోరా వీడీసీ చైర్మన్ చేగంటి గంగాధర్, ఎఫ్‌సీఎస్ అధ్యక్షుడు ముస్లి ఎర్రన్న, కార్యదర్శి గజానవేణి మోహన్, బీజేపీ జిల్లా నాయకుడు నాగార్జున్‌రెడ్డి, కిసాన్ మోర్చా మండల ఉపాధ్యక్షుడు తక్కూరి అంజయ్య, సీనియర్ నాయకులు పార్వతి శ్రీనివాస్ గౌడ్, బూత్ అధ్యక్షులు వాల్గోట్ బాబూరావు, తక్కూరి రామ్, వాల్గోట్ భాస్కర్, నడుకుడ రమేష్, మోహన్, రాములు, దాస్, రాకేష్, ఆదిత్య, బీజేపీ కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.