Polavaram-Review : ఐకానిక్ బ్రిడ్జికి గ్రీన్ సిగ్నల్ Andhra Prabha Top News

Polavaram-Review : ఐకానిక్ బ్రిడ్జికి గ్రీన్ సిగ్నల్ Andhra Prabha Top News

  • పనుల్లో స్పీడ్ పెంచాలని ఆదేశం
  • పోలవరం 89% పూర్తి..
  • గ్యాప్ పనులు త్వరగా ముగించాలని సీఎం ఆదేశాలు
  • నిర్వాసితులకు ఇబ్బంది ఉండొద్దు
  • పోలవరంపై చంద్రబాబు ఫోకస్
  • రూ.35 వేల కోట్లతో మరిన్ని ప్రాజెక్టులు

(ఆంధ్రప్రభ, ఏలూరు బ్యూరో (

ఏ Polavaram-Review : లూరు జిల్లా పోలవరం ప్రాజెక్టు వద్ద అధికారులు, ప్రజా ప్రతినిధులు, కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష జరిపారు. ఇప్పటి వరకూ 89 శాతం మేర సివిల్ పనుల్లో పురోగతి ఉందని అధికారులు తెలిపారు. ఎర్త్ కం రాక్ ఫిల్ డ్యామ్ గ్యాప్ 2, గ్యాప్ 1 పనులు నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.. కుడి, ఎడమ కాలువల కనెక్టివిటీ టన్నెల్ పనులు ఈ నెలాఖరుకు పూర్తి అవుతాయని అధికారులు వెల్లడించారు. ప్రాజక్టు డ్యామ్ కు చేరుకునే వివిధ రోడ్లు, కుడి, ఎడమ గట్లు కు సంబధించిన పనులు, గండి పోచమ్మ ఆలయం అభివృద్ధి పనులు వేగంగా చేపట్టాలని సీఎం ఆదేశాంచారు.

పునరావాసం, పరిహారం అందించే విషయంలో నిర్వాసితులకు ఇబ్బంది లేకుండా చూడాలని , భూ సేకరణ, ఆర్ అండ్ ఆర్, పునరావాసం త్వరితగతిన పూర్తి చేయాలని సీఎం స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు వద్ద ఐకానిక్ బ్రిడ్జిని నిర్మించాలని సూచించారు. వివిధ మౌలిక సదుపాయాలు కూడా కల్పించాలని ఆదేశించారు. 2014 నుంచి ఇప్పటి వరకూ పోలవరం ప్రాజెక్టును 37 సార్లు సీఎం చంద్రబాబు నాయుడు సందర్శించారు.
136 మార్లు ప్రాజెక్టు పనుల పురోగతి పై సమీక్షలు నిర్వహించారు.

Polavaram-Review : రూ.35 వేల కోట్లతో పనులు

పోలవరం ప్రాజెక్టు సైట్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రాధాన్యతా క్రమంలో చేపట్టనున్న 36 ప్రాజెక్టులపై సీఎం సమీక్ష జరిపారు. మూడేళ్లలో 36 సాగునీటి ప్రాజెక్టులకు రూ.35,313 కోట్లు ఖర్చు చేయాలని ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. ఏపీఎస్ఐడీసీ సంస్థ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 1023 సాగు సాగునీటి పథకాల పునరుద్ధరణ పనులు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు.
రూ.3,883 కోట్ల వ్యయం తో 8.42 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు అందే అవకాశం ఉందని అంచనా వేశారు. కమాండ్ ఏరియా డెవలప్మెంట్ ఆధునీకరణ, నీటి యాజమాన్యం ప్రాజెక్టు కింద మన్యం, విజయనగరం జిల్లాలో పనులు చేపట్టాలని సీఎం ఆదేశించారు. జలధార కార్యక్రమం ద్వారా 100 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 11,133 చెరువులు, ఫీడర్ చానల్స్ తో భూగర్భ జలాలు పెరిగేలా పనులు చేసినట్టు అధికారులు వివరించారు. వీబీజీ రామ్ జి ద్వారా జలధార పనులు చేపట్టాలని సీఎం ఆదేశించారు. ఈ ఏడాది దేశంలోనే అత్యధికంగా రూ.2500 కోట్లు ఉపాధి హామీ పథకం ద్వారా ఖర్చు చేసినట్టు అధికారులు తెలిపారు. జలధార పనులకు ప్రతీ జిల్లాకు రూ.2 కోట్ల మేర నిధుల విడుదలకు సీఎం ఆదేశించారు.