1 నుంచి 13 ఏళ్ల పిల్లలకు నట్టల నివారణ మాత్రల పంపిణీ

భీంగల్ రూరల్, ఆంధ్రప్రభ : పిప్రి గ్రామంలోని ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో సోమవారం జాతీయ డీవార్మింగ్ కార్యక్రమాన్ని నిర్వహించి, ఒకటి నుంచి 13 సంవత్సరాల వయస్సు గల విద్యార్థులకు కడుపులో నట్టలు (పురుగులు) నివారణ కోసం ఆరు నెలలకు ఒకసారి అందించే డీవార్మింగ్ మాత్రలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆరోగ్య శాఖ సిబ్బంది విద్యార్థులకు మాత్రలు వేయించి, కడుపులో పురుగుల నివారణతో పిల్లల ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు శారీరక, మానసిక ఎదుగుదలకు దోహదపడుతుందని వివరించారు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి డీవార్మింగ్ మాత్రలు తీసుకోవడం అవసరమని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఆరిగేలా జనార్ధన్, ఉప సర్పంచ్ జేమ్స్, వార్డు సభ్యుడు యోనా, ఆరోగ్య శాఖ, ఆశా సిబ్బంది జమున, దుర్గి లావణ్య, భాగ్య ప్రాథమిక, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.