Snake Bite | తల్లి పరిస్థితి విషమం

Snake Bite | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : మెదక్ జిల్లాలోని చిన్నశంకరంపేటలో విషాద ఘటన చోటుచేసుకుంది. అర్ధరాత్రి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో తల్లీకూతుళ్లను పాము కాటేయడంతో కుటుంబంలో విషాదం నెలకొంది.

ఈ ఘటనలో తొమ్మిదేళ్ల హారిక అనే బాలిక మృతిచెందింది. పాము కాటుకు గురైన ఆమె తల్లి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతోంది. ఘటనపై సమాచారం అందుకున్న అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. పాము ఏ జాతికి చెందినది, ఘటన ఎలా జరిగిందనే అంశాలపై ఆరా తీస్తున్నారు. ఈ విషాద ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.