KCR | గులాబీ బాస్ కు నోటీసులు..
బీఆర్ఎస్ బాస్, మాజీ సీఎం కేసీఆర్‌కు లీగల్ నోటీసులు అందాయి. ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్.. అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకపోవడంపై ఫెడరేషన్ ఆఫ్ ఫార్మర్స్ అసోసియేషన్ ఇన్ తెలంగాణ లీగల్ నోటీసులు పంపింది. శాసనసభలో అపోజిషన్ లీడర్‌గా తన కర్తవ్యాన్ని నిర్వర్తించని కేసీఆర్‌కు సభ్యునిగా కొనసాగే అర్హత లేదని నోటీసులో పేర్కొంది.
ఈ మేరకు ఫెడరేషన్ ఆఫ్ ఫార్మర్స్ అసోసియేషన్ ఇన్ తెలంగాణ తరపు న్యాయవాది పాదూరి శ్రీనివాస్ రెడ్డి మెయిల్, స్పీడ్ పోస్ట్ ద్వారా నోటీసులు పంపించారు. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో కేసీఆర్ పోరాటం చేయాలని లేదంటే అపోజిషన్ లీడర్‌గా తొలగించాలని డిమాండ్ చేశారు.