టేకుమట్లలో ఎమ్మెల్యే గండ్ర పర్యటన..

టేకుమట్ల, ఆంధ్రప్రభ : భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు సోమవారం టేకుమట్ల మండలంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి, స్థానిక ప్రజలతో సమావేశం కానున్నారు.పర్యటనలో భాగంగా ఉదయం 9 గంటలకు గర్మిళ్లపల్లి, 9:30 గంటలకు పంగిడిపల్లి, 10 గంటలకు వెంకట్రావుపల్లి, 10:30 గంటలకు దుబ్యాల, 11 గంటలకు టేకుమట్ల గ్రామాల్లో పర్యటిస్తారు. ఈ కార్యక్రమాల్లో జిల్లా, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, మీడియా ప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని టేకుమట్ల మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కోటగిరి సతీష్ గౌడ్ కోరారు.