గాన సరస్వతి జానకమ్మ కు అక్షర నివాళులు…
నంద్యాల ప్రతినిధి, ఆంధ్రప్రభ : నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు హంస అవార్డు గ్రహీత కళారత్న చింతలపల్లె కోటేష్ ప్రసిద్ద దిగ్గజ గాయని గాన సర స్వతి ఎస్. జానకి చిత్రాన్ని వినూత్న రీతిలో వేశారు. ఆదివారం కోటేష్ మాట్లాడుతూ ఎస్. జానకమ్మ (88) ఆరోగ్య సమస్యల వలన మైసూర్ లోని అపోలో ఆస్పత్రి లో తుది శ్వాస విడిచారన్నారు. జానకమ్మ ఆరు దశబ్దాలుగా 50 వేల పైగా పాటలు పాడారు. ఆమె మరణం భారతీయ సంగీత ప్రపంచానికి తీరనిలోటు. అద్భుతంగా పాటలు పాడి కోట్లాది సంగీత అభిమానులను సంపాదించుకున్నారు.అటువంటి జానకమ్మ గారిని స్మరించుకుంటూ ఏ 3 డ్రాయింగ్ షీట్ మీద ఎటువంటి గీతలు లేకుండా మైక్రో పెన్ను, జెల్ పెన్నుతో ఆమె పాడిన పాటల పల్లవులతో ఆమె చిత్రాన్ని వేసి మరియు జానకమ్మ జీవిత చరిత్ర ను తెలుగు అక్షరాలతో వ్రాసి చిత్ర నివాళులు అర్పించానరు.జానకమ్మ స్వరం లో ప్రేమ, విషాదం, జానపదం, భక్తి, క్లాసికల్ మెలోడీ ఇలా అన్ని రకాల పాటలకు తన గాత్రం తో రంజిప చేసిందన్నారు. ఆమె పేరు చెప్పగానే ఎన్నో వైవిద్య మైన పాటలు గుర్తుకు వస్తాయన్నారు .
పగలే వెన్నెల జగమే ఊయల, మనసా తుళ్లి పడకే అతిగా ఆశ పడకే, సిరి మల్లె పువ్వా సిరి మల్లె పువ్వా, మనసు పలికే మౌన గీతం, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు ఇలా ఎన్నెన్నో పాటలు పాడారన్నారు. చిన్నపిల్లలను, అనుకరిస్తూ పాడే పాటలు జానకమ్మ తప్ప ఇంకా ఎవ్వరులేరన్నారు.సప్తపది చిత్రం లో గోవుల్లు తెల్లన గోపయ్య నల్లన, చిన్నారి పొన్నారి కిట్టయ్య నిన్ను ఎవరు కొట్టారయ్యా అమ్మ నన్ను కొట్టింది బాబు అనే పాటలో అద్భుతం పాడారు. అలాగే నాద స్వరం, వయోలిన్, షహనాయి వంటి వాయుధ్యాలలో దీటుగా పాడే గలిగే గాయని భారత దేశంలో జానకి గారే. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, సంస్కృతం, ఉర్దూ, పంజాబి, బెంగాలీ, ఇంగ్లీష్, జపనీస్, జర్మన్ భాష లో పాడిన ఘనత జానకమ్మ గారిదే.ఇలా ఎన్నో భాషల్లో పాడారు.అటువంటి మహా గాయని మన తెలుగు వారిగా పుట్టడం తెలుగు ప్రజల అదృష్టం. రాష్ట్ర ప్రభుత్వల నుండి 33 పైగా అత్యున్నత పురస్కారాలు, ఎన్నెన్నో నేషనల్ అవార్డ్స్,2013 లో భారత ప్రభుత్వం చే అత్యున్నత “పద్మ భూషణ్ “పురస్కారం. అందుకుంది. బౌతికం గా జానకమ్మ లేకపోయినా ఆమె పాడిన మధుర మైన పాటలతో కోట్లాది అభిమానుల హృదయం శాశ్వతంగా వుంటారు. అటువంటి కళామా తల్లి కీ, గాన సరస్వతికి అక్షర చిత్రానివాళ్లు అందరము నివాళులు అర్పించాల్సిందే.
