women | ఆదోనిలో మహిళల సందడి

women | ఆదోనిలో మహిళల సందడి

women | ఆదోని, ఆంధ్రప్రభ : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదోని పట్టణంలో మహిళలు పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఆర్‌పీలు, మహిళలు కలిసి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు గుడిసె ఆది కృష్ణమ్మను ఆదోనిలోని క్యాంప్ కార్యాలయంలో కలుసుకున్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని కేక్ కట్ చేసి ఒకరికి ఒకరు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. మహిళలు ఐక్యతతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా మహిళలను ఉద్దేశించి ఆది కృష్ణమ్మ మాట్లాడుతూ మహిళ అంటే శక్తి, మహిళ అంటే సాహసం, మహిళ అంటే సృష్టి అని పేర్కొన్నారు. సమాజ నిర్మాణంలో మహిళల పాత్ర అపారమని, కుటుంబానికి ధైర్యం, సమాజానికి దారిదీపం, దేశానికి బలంగా నిలిచేది మహిళేనని అన్నారు.

women |

ప్రతి రంగంలో తమ ప్రతిభను చాటుతూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్న మహిళలందరికీ హృదయపూర్వక అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మహిళల గౌరవం, భద్రత, సమాన హక్కులు కలిగిన సమాజం కోసం అందరూ కలిసి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్‌పీలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

women |
women |

CLICK HERE TO READ MORE : 170 people | మహిళా సాధికారతకు పెద్దపీట వేద్దాం…

CLICK HERE TO READ MORE :

Leave a Reply