మక్తల్ రోడ్లకు మహర్దశ..
- రూ.320 కోట్లతో హ్యామ్ రోడ్లు
- రేపు మక్తల్ కు మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు రాక
- పైలాన్ ను ఆవిష్కరించనున్న మంత్రులు
- కాంగ్రెస్ నాయకుల సమీక్ష సమావేశంలో మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి
మక్తల్, ఆంధ్రప్రభ : హ్యామ్ రోడ్లతో మక్తల్ రోడ్లకు మహర్దశ పట్టనుందని రూ.320 కోట్లతో హ్యామ్ రోడ్లు నిర్మిస్తున్నామని రాష్ట్ర పశుసంవర్ధక క్రీడల శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి అన్నారు.సోమవారం
మక్తల్ లో హ్యామ్ రోడ్ల శంకుస్థాపనకు మంత్రుల రాక సందర్బంగా ఆదివారం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో మంత్రి వాకిటి శ్రీహరి సమీక్షా సమావేశం నిర్వహించారు. సోమవారం మక్తల్ కు మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు రానున్నారని ఆయన తెలిపారు.
పైలాన్ ఆవిష్కరించి పనులు ప్రారంభిస్తామని చెప్పారు.

రూ.320 కోట్లతో మక్తల్ నియోజకవర్గం లో హ్యామ్ రోడ్లు నిర్మించనున్నట్లు తెలిపారు. ఒక్క మక్తల్- నారాయణపేట ఫోర్ లైన్ రోడ్డు కే రూ.237 కోట్లు ఖర్చు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. అదేవిధంగా మరికల్ – మినాస్ పూర్ – లింగంపల్లి రోడ్డు కు రూ.49.57 కోట్లు,ఆత్మకూరు – మరికల్ రోడ్డు కు రూ.22.47 కోట్లు, మాగనూరు మండలం నల్లగట్టు – హిందూపూర్ రోడ్డుకు రూ.10.49 కోట్లతో రోడ్లు వేయనున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. ఈ పనులన్నీ కేవలం ఏడాది లోపు పూర్తి అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
హ్యామ్ రోడ్లకు సంబంధించి సోమవారం మంత్రులు పైలాన్ ను ఆవిష్కరిస్తారని మంత్రి వాకిటి శ్రీహరి స్పష్టం చేశారు. అనంతరం ఐలిన్ స్కూల్ వద్ద జరిగే బహిరంగ సభను విజయవంతం చేయాలని ప్రజలకు మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మక్తల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కట్ట సురేష్ కుమార్ గుప్తా, బోయ రవికుమార్,కావలి శ్రీహరి, వాకిటి హన్మంతు , శ్రీనివాస్ గౌడ్, శివరాంరెడ్డి ,ఆనంద్ గౌడ్, విజయ్ గౌడ్ ,గోవర్ధన్, కావాలి తాయప్ప, శివరాజ్ ,గుర్లపల్లి భీమ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
