ఘనంగా పూర్వ ప్రాథమిక విద్యా తరగతుల ప్రారంభం

చౌటుప్పల్ (ఆంధ్రప్రభ): చౌటుప్పల్ మండల పరిధిలోని ఆరెగూడెం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో పూర్వ ప్రాథమిక విద్యా (ప్రీ-ప్రైమరీ) తరగతులను ఘనంగా ప్రారంభించారు. గ్రామ సర్పంచ్ ఎన్నపల్లి ధనలక్ష్మి వెంకట్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి తరగతులను ప్రారంభించారు. ఈ సందర్భంగా చిన్నారులకు నాణ్యమైన విద్య అందించి పాఠశాలను మరింత అభివృద్ధి చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. పూర్వ ప్రాథమిక తరగతి ఇన్‌స్ట్రక్టర్‌గా ఎంపికైన రాజేశ్వరి, ఆయాగా ఎంపికైన నాగమణిని అభినందించారు.

స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు సత్యనారాయణ మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో విద్యను అభ్యసించి ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ సత్యనారాయణ, ప్రధానోపాధ్యాయురాలు కవిత, వేణుగోపాల్, వార్డు సభ్యులు, ఉపాధ్యాయులు, అంగన్‌వాడీ టీచర్లు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.