కనకదుర్గమ్మను దర్శించుకున్న శ్రీకాళహస్తి దేవస్థానం చైర్మన్

ఇంద్రకీలాద్రి ఆంధ్రప్రభ : విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో కొలువైయున్న కనకదుర్గమ్మ వారిని శ్రీకాళహస్తి దేవస్థానం పాలకమండలి చైర్మన్ కే సాయికుమార్ దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా దేవస్థానానికి వచ్చిన ఆయనకు ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం పలికిన అధికారులు అమ్మవారి దర్శన ఏర్పాట్లు చేశారు.

అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వేదపండితుల వేదసిరచనం చేయగా ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటం ప్రసాదాలను అందజేశారు. అనంతరం శ్రీకాళహస్తి దేవస్థానం చైర్మన్ కే సాయికుమార్ దుర్గగుడి చైర్మన్ బొర్రా రాధాకృష్ణను మర్యాదపూర్వకంగా కలిశారు. మహా మండపం ఏడవ అంతస్తులో ఉన్న చైర్మన్ ఛాంబర్ కు వెళ్లిన ఆయన చైర్మన్ గాంధీతో కొద్దిసేపు భేటీ అయ్యారు.