ఒక్క అర్హుడైన ఓటరు కూడా మిస్ కాకూడదు

  • సర్పంచ్ బైకని రాజు

రఘునాథపల్లి, ఆంధ్రప్రభ : రఘునాథపల్లి మండలం కుర్చపల్లి గ్రామంలో భారత ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ బైకని రాజు శుక్రవారం పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామంలోని ప్రతి అర్హుడైన ఓటరు పేరు ఓటరు జాబితాలో తప్పనిసరిగా నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలని బీఎల్‌ఓలు, బూత్ లెవల్ ఏజెంట్లకు సూచించారు. ఒక్క అర్హుడైన ఓటరు కూడా జాబితాలో నమోదు కాకుండా మిగిలిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.

ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి, అర్హులైన ప్రతి ఒక్కరి పేరును ఓటరు జాబితాలో నమోదు చేయాలని సూచించారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాల మేరకు ఎస్‌ఐఆర్ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎం. దేవేందర్ రెడ్డి, పులిగిల్ల రాజు, టీ. మమత, కాసాని అశ్విని, చి. వెంకటు రాజుతో పాటు పలువురు పాల్గొన్నారు.