Digital Portal | ఈనెల 15లోపు పీఎఫ్ వడ్డీ జమ..

Digital Portal | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌వో) పీఎఫ్ చందాదారులకు శుభవార్త తెలిపింది. సేవలను మరింత సులభతరం చేసే లక్ష్యంతో కొత్త డిజిటల్ పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ద్వారా చందాదారులు తమ పీఎఫ్ ఖాతాలోని రూ.5 లక్షల వరకు ఉన్న మొత్తాన్ని ఆటోమేటిక్ క్లెయిమ్ సెటిల్మెంట్ విధానంలో వేగంగా పొందే అవకాశం కల్పించింది.

అదే సమయంలో పీఎఫ్ ఖాతాదారులకు మరో కీలక ప్రకటన చేసింది. ఈ నెల 15 నాటికి పీఎఫ్ ఖాతాల్లో 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన 8.25 శాతం వడ్డీ జమ చేసే ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు ఈపీఎఫ్‌వో వెల్లడించింది.

దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 34 కోట్ల ఈపీఎఫ్ ఖాతాల్లో వడ్డీ జమ చేసే ప్రక్రియ కొనసాగుతోందని సంస్థ తెలిపింది. కొత్త డిజిటల్ పోర్టల్‌తో క్లెయిమ్‌ల పరిష్కారం మరింత వేగంగా, పారదర్శకంగా సాగుతుందని ఈపీఎఫ్‌వో పేర్కొంది.