తహసీల్దార్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

దండేపల్లి, ఆంధ్రప్రభ: దండేపల్లి మండల తహసీల్దార్ కార్యాలయాన్ని అదనపు కలెక్టర్ వి. రాములు మంగళవారం ఆకస్మికంగా సందర్శించి, కార్యాలయ రికార్డులు, రిజిస్టర్లను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా భూభారతి, సాదా బైనామా, ఎస్‌ఐఆర్ అంశాలపై ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఎస్‌ఐఆర్ ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేసి, ఎలాంటి జాప్యం లేకుండా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

భూభారతి, సాదా బైనామాకు సంబంధించిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో సకాలంలో విచారణ జరిపి, నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని సూచించారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు పారదర్శకంగా, వేగంగా అందేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రోహిత్ దేశ్‌పాండే, డిప్యూటీ తహసీల్దార్ మాధవి, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.