ఎన్సీడీ సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి
- జిల్లా అధికారి రాజరాజేశ్వరి
శావల్యాపురం, ఆంధ్రప్రభ : ఎన్సీడీ సర్వే త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్రీయ బాల్ స్వాస్థ్య జిల్లా అధికారిని డాక్టర్ రాజరాజేశ్వరి అన్నారు. మండల కేంద్రమైన శావల్యాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆమె మంగళవారం అకస్మికంగా తనిఖీ చేశారు. మండలంలోని అన్ని పాఠశాలలో హెల్త్ ప్రోగ్రాం ఎలా జరుగుతుందో రికార్డులు పరిశీలించారు. పిల్లలందరికీ ఆరోగ్య పరీక్షలు చేయాలని సూచించారు. పిహెచ్సి పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలని, అదేవిధంగా ఓపిలు, రోగులకు రక్త పరీక్షలు సక్రమంగా జరుగుతున్నాయో లేదో పరీక్షించారు.
అనంతరం కనుమర్లపూడిలో ఆరోగ్య ఉపకేంద్రాన్ని సందర్శించి ఆరోగ్య కార్యక్రమాలు, స్కూల్ హెల్త్ స్టాఫ్ రికార్డులు తనిఖీ చేసి రాష్ట్రీయ బాల్ స్వాస్థ్య కార్యక్రమమం త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. మండల వైద్యాధికారి రమ్య, సూపర్వైజర్లు నారాయణమ్మ, ఏడుకొండలు, ఉమాదేవి, స్టాఫ్ నర్స్ ధనలక్ష్మి, సీనియర్ అసిస్టెంట్ అయ్యన్న, మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ పృద్విరాణి, ఏఎన్ఎం రాజ్యలక్ష్మి ఉన్నారు.
