అభివృద్ధి సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం..

ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య

కంచికచర్ల, ఆంధ్ర‌ప్ర‌భ : అభివృద్ధి సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పేర్కొన్నారు. కంచికచర్ల మండలం గొట్టుముక్కల గ్రామంలో ఎన్ఆర్ఈజీఎస్ నిధులు కోటి 60 లక్షల రూపాయలతో నిర్మించిన సిసి రోడ్లను ఎమ్మెల్యే సౌమ్య కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులతో కలిసి మంగళవారం సాయంత్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సౌమ్య మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో మౌలిక సదుపాయాల కల్పనకు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నదన్నారు. గ్రామాల సమగ్రాభివృద్ధి ప్రభుత్వ ధ్యేయమని, ప్రజలకు మెరుగైన రహదారులు, తాగునీరు, పారిశుద్ధ్యం వంటి మౌలిక వసతులు అందించటం ద్వారా గ్రామీణ జీవన ప్రమాణాలను మరింత మెరుగు పరచటానికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తున్నదన్నారు.

అభివృద్ధి ఫలాలు ప్రతి ఇంటికి చేరేలా కూటమి ప్రభుత్వం కార్యాచరణ అమలు చేస్తున్నదన్నారు. నేటి యువతరానికి రాబోయే నవతరానికి కూటమిపాలన స్ఫూర్తిదాయకమన్నారు. అభివృద్ధి సంక్షేమమే కూటమి ప్రభుత్వా నినాదం అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీల రాష్ట్ర ఉపాధ్యక్షులు కోగంటి వెంకట సత్యనారాయణ బాబు, ఎంపీడీవో వెంకటేశ్వరరావు, పిఆర్ ఏఈ రవికుమార్, గోగినేని అమర్నాథ్, బండ్లమూడి గోవర్ధన రావు, గోగినేని శ్రీనివాసరావు, మాజీ గ్రామ సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు.