పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంచాలి – ఎంఈఓ సాంబశివరావు
శావల్యాపురం, ఆంధ్రప్రభ : పాఠశాల పరిసర ప్రాంతాల ఎల్లప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని ఎంఈఓ మద్దికుంట సాంబశివరావు అన్నారు. మండలంలోని శానంపూడి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను, ఎస్ హెచ్‌సి పాఠశాలను మంగళవారం ఎంఈఓ తనిఖీ చేశారు.
విద్యార్థుల శక్తి సామర్థ్యాలు పరిశీలించి విద్యా సామర్ధ్యాలు తక్కువగా ఉన్న విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. విద్యార్థులందరికీ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యా కిట్లను అందజేయాలని సూచించారు. హెచ్ఎం శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.
