డెంగ్యూ వ్యాధి వ్యతిరేక మాసోత్సవ ర్యాలీ
డెంగ్యూ జ్వరాల పై అవగాహన సదస్సు
చిట్టినగర్, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ ప్రజా ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ జాతీయ కీటికజనిత వ్యాధి నియంత్రణ కార్యక్రమం లో భాగంగా ఎన్టీఆర్ జిల్లా మలేరియా అధికారి డాక్టర్ డి రాజు నాయక్ ఆధ్వర్యంలో జూలై 1 వ తేదీ నుండి 31 తేదీ వరకు డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవ కార్యక్రమాన్ని చిట్టి నగర్ యు.పి.హెచ్ సి లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డెంగ్యూ జ్వరాలు పై అవగాహన సదస్సు ర్యాలీ ని వైద్య ఆరోగ్య శాఖ లోని మలేరియా విభాగము విజయవాడ నగరపాలక సంస్థ సంయుక్తంగా నిర్వహించారు. ఇందులో భీమనవారి పేట, చిట్టి నగర్, లంబాడీ పేట అర్బన్ హెల్త్ సెంటర్ సిబ్బంది డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవ ర్యాలీ నిర్వహించారు.
ఈసందర్భంగా డాక్టర్ రాజు నాయక్ యూపీహెచ్సీ ల పరిధిలోని ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతు దోమల నివారణ నిమిత్తము దీర్ఘ కాలిక నీటి నిల్వలు ఉండకూడదని అన్నారు. అలా నిల్వ ఉంచితే ఆ నీటిలో దోమలు గుడ్లు పెట్టి తద్వారా దోమ సంతతి పెరిగుతుంది అని అన్నారు. దాంతో మలేరియా, డెంగ్యూ , చికెనుగున్యా ,ఫైలేరియా జపనీస్ ఎన్సెఫిలిటిస్ తదితర ప్రాణాంతక వ్యాధులు సంభవిస్తాయి అని అన్నారు. కావున ఇంటి పరిసర ప్రాంతాలలో ఉపయోగించని పాత టైర్లు, ఖాళీ కొబ్బరి బొండాలు, పూల కుండీలు, వంటి వాటిలో నీరు నిల్వ ఉండటానికి అవకాశం లేకుండా చూడాలని ఆయన అన్నారు.
ప్రతి శుక్రవారం వైద్య సిబ్బంది విఎంసి సిబ్బంది నిర్వహించు ఫ్రైడే డ్రై డే కార్యక్రమంలో ప్రజలు పాల్గొని సహకరించాలని కోరారు ఇంటిలో ఉండు కూలర్లలో నిల్వ నీటిని ఎప్పటికప్పుడు తొలగించవలెనని అన్నారు. అలాగే ఫ్రిజ్ నందు డ్రై ట్రే లో నీటిలో కొద్దిగా ఉప్పు వేసి ఉంచాలి అని అన్నారు, ప్రతి మూడు రోజులకు ఒకసారి కొండ ప్రాంత ప్రజలు డ్రమ్ము ల్లో నిల్వ ఉంచుకున్న నీటిని తొలగించి మళ్ళీ నీటి పట్టుకోవాలి అని అన్నారు.
జ్వరగ్రస్తులు జ్వరం వచ్చిన వెంటనే దగ్గరలో ఉన్న మలేరియా క్లినిక్ లో కానీ యూపీహెచ్సీ వైద్యాలయం లో లాబ్ నందు కానీ తప్పని సరిగా రక్త పరీక్షలు చేయించుకొని వలెను అని అన్నారు. ర్యాలీ నిర్వహించిన అనంతరము చిట్టి నగర్, భీమనవారిపేట యూపీహెచ్సీ వైద్య సిబ్బంది, వి ఎం సి శానిటేషన్, పిడిపి మలేరియా సిబ్బంది చేత డెంగ్యూ నిర్మూలన ప్రతిజ్ఞ జిల్లా మలేరియా అధికారి చేయించారు. ఈ కార్యక్రమంలో యు.పి హెచ్. సీ డాక్టర్ జ్యోతి అలేఖ్య , డాక్టర్ విజయ సుధ,ఎ వి సుబ్బారావు మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్ , ఏ.ఎన.ఏం లు, ఆశా వర్కర్లు, దుర్గారావు శానిటరీ ఇన్స్పెక్టర్ మలేరియా ఇన్స్పెక్టర్ అనిల్ , పిడిపి దుర్గారావు యాంటీ లార్వా సిబ్బంది, శానిటరీ సిబ్బంది, సబ్ యూనిట్ 4 కొత్తపేట మలేరియా సిబ్బంది , లోకల్ మెంబెర్స్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
