ఘనంగా ఎమ్మార్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
జెండా ఆవిష్కరణ.. అంబేద్కర్ విగ్రహానికి నివాళులు.. మందకృష్ణ మాదిగ సేవలను కొనియాడిన నాయకులు
మునుగోడు, ఆంధ్రప్రభ : మునుగోడు మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండల అధ్యక్షుడు పందుల అంజి మాదిగ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్‌చార్జి మేడి శంకర్ మాదిగ పాల్గొని ఎమ్మార్పీఎస్ జెండాను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మేడి శంకర్ మాదిగ మాట్లాడుతూ, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో సాగిన సుదీర్ఘ ఉద్యమ ఫలితంగానే ఎస్సీ వర్గీకరణ సాధ్యమైందని అన్నారు. పీడిత, అణగారిన వర్గాల హక్కుల సాధన కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ప్రతి ఏడాది జూలై 7న ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవంతో పాటు మందకృష్ణ మాదిగ జన్మదినాన్ని ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు.
అనంతరం అంబేద్కర్ సెంటర్‌లో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అలాగే మందకృష్ణ మాదిగ 62వ జన్మదిన వేడుకలను కేక్ కట్ చేసి నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు దుబ్బ గోపాల్, పందుల పర్వతాలు, పందుల మల్లేష్ మాదిగ, పందుల వెంకన్న మాదిగ, పందుల లక్ష్మణ్ మాదిగ, గాదెపాక ప్రభాకర్ మాదిగ, బోయపర్తి యాదయ్య మాదిగ, పందుల భాస్కర్, పందుల గంగాధర్, రాజేష్, పోలే వెంకన్న మాదిగ, దుబ్బ భాస్కర్ మాదిగ, పోలే రాజు మాదిగ, దుబ్బ అనిల్ మాదిగ, జీడిమెట్ల నరసింహ మాదిగ, బొలుగూరి ప్రభాకర్ మాదిగ, మేడి సైదులు, పందుల సైదులు, యాదగిరి, నరసింహ, పవన్, సైదులు తదితరులు పాల్గొన్నారు.
