ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి..

డిపో ఎదుట బ్యాడ్జీలతో నిరసన

ఎలక్ట్రిక్ బస్సులను ప్రైవేటుకు ఇవ్వొద్దని జేఏసీ డిమాండ్

ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ : ఆర్టీసీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఏపీఎస్ ఆర్టీసీ రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు మంగళవారం ఉరవకొండ ఆర్టీసీ డిపో ఎదుట కార్మికులు బ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు.

డిపో జేఏసీ నాయకులు నారాయణస్వామి, మాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనలో కార్మికులు పాల్గొని తమ డిమాండ్లను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణను ప్రైవేట్ ఆపరేటర్లకు అప్పగించకుండా ఆర్టీసీ ద్వారానే కొనుగోలు, నిర్వహణ, మెయింటెనెన్స్, విధుల నిర్వహణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థగా ఆర్టీసీని మరింత బలోపేతం చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు.