పేద కుటుంబాలకు వరం ఇందిరమ్మ ఇండ్లు..

బిక్కనూర్, ఆంధ్రప్రభ : పేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇందు వరం లాంటివని కామారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రకాంత్ రెడ్డి అన్నారు. మంగళవారంభిక్కనూరు మండలంలోని జంగంపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు పథకం కింద నిర్మించిన నూతన గృహాన్ని ప్రారంభించారు. అనంతరం గృహ యజమానులను పట్టు వస్త్రాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా నిరుపేద కుటుంబాలకు సొంతింటి కల నెరవేరుతోందని ఆయన పేర్కొన్నారు.

అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తుందని గుర్తు చేశారు. అట్టి పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నరేందర్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీరామ్ వెంకటేష్, డీసీసీ కార్యదర్శి రాజబాబు గౌడ్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు జీవన్, ఉప సర్పంచ్ ప్రకాష్, మాజీ సర్పంచ్ నర్సింలు యాదవ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మమత సత్యం, ఆలయ కమిటీ డైరెక్టర్ కార్తీక్, నర్సింలు, రామస్వామి, బాలన్న, బాబు ఆనంద్, రవి, అనిల్, బన్నీ తదితరులు పాల్గొన్నారు.