1-0-Merino-Goal : స్పెయిన్​ క్లీన్​ షీట్​ Andhra Prabha Sports Story

1-0-Merino-Goal : స్పెయిన్​ క్లీన్​ షీట్​ Andhra Prabha Sports Story

  • మెరీనా మ్యా.జిక్​ గోల్​
  • పోర్సుగల్​ ఇంటికి
  • 1-0 తేడాతో స్పెయిన్​ విజ.యం
  • క్వార్టర్​ ఫైనల్​ బెర్ట్​ ఖరారు
  • రోనాల్డో కన్నీటి వీడ్కోలు

( ఆంధ్రప్రభ, క్రీడాప్రతినిధి )

పోర్చుగల్​ లెజెండ్​ క్రిస్టియానో రొనాల్డో ఆశలు… కన్నీళ్లుగా మారాయి.
డల్లాస్ అర్లింగ్టన్) లోని ప్రతిష్టాత్మక ఏటీ అండ్​ టీ స్టేడియం వేదికగా స్పెయిన్, పోర్చుగల్ జట్ల మధ్య ఆద్యంతం వ్యూహాత్మకంగా, క్షణక్షణం నరాలు తెగే టెన్షన్​ తో పాగిన ఈ మ్యాచ్​ లో… ఏకైక గోల్​ తేడాతో ఫిఫా టోర్నీ హాట్​ ఫేవరేట్​ స్పెయిన్​ క్వార్టర్​ ఫైనల్​ కు చేరుకుంది. పోర్చుగల్​ జట్టు ఈ టోర్నీ నుంచి నిష్క్రమించింది.
స్పెయిన్​ స్టార్​ మెరీనో ‘లాస్ట్ మినిట్’ మ్యాజిక్​ తో,, పోర్చుగల్​ జట్టు ఓటమి రుచి చూసింది. ఈ మ్యాచ్ మొత్తం ఇరు జట్లు డిఫెన్స్‌కే ప్రాధాన్యం ఇచ్చాయి. మ్యాచ్​ నిర్ణీత సమయం 90 నిమిషాల వరకు స్కోరు 0-0 గానే ఉంది ఇంజూరీ టైమ్ 90 +1 మొదటి నిమిషంలో, ఫెర్రాన్ టోర్రెస్ అందించిన అద్భుత పాస్‌ను సబ్‌స్టిట్యూట్ మిడ్‌ ఫీల్డర్ మైకెల్ మెరీనో బంతిని లో-ఫినిష్‌తో పోర్చుగల్ గోల్‌కీపర్ డియోగో కోస్టాను బోల్తా కొట్టించాడు, ఈ ఏకైక గోల్‌తో స్పెయిన్ 1-0 ఆధిక్యం సాధించి క్వార్టర్స్ బెర్తును ఖాయం చేసుకుంది ఈ టోర్నీలో స్పెయిన్ తన డిఫెన్స్‌ను పటిష్టంగా ఉంచుకుంటూ ఇప్పటివరకు ఒక్క గోల్ కూడా లీక్ చేయకుండా క్లీన్ షీట్ తో క్వార్టర్స్‌కు చేరడం విశేషం

1-0-Merino-Goal : రొనాల్డో కంట తడి

ఈ అనూహ్య అపజయంతో పోర్చుగల్​ లెజెండ్​ క్రిస్టియానో రొనాల్డో కన్నీటి వీడ్కోలు పలికాడు. మ్యాచ్ ముగిసే సరికి ఓటమిని జీర్ణించుకోలేక రొనాల్డో మైదానంలోనే భావోద్వేగానికి గురై, కన్నీళ్లతో అభిమానులకు అభివాదం చేస్తూ టన్నెల్ వైపు వెళ్లాడు ఇదే చివరి ఫిఫా వరల్డ్ కప్ అని మ్యాచ్‌కు ముందే స్పష్టం చేశాడు ఈ టోర్నీ ద్వారా వరల్డ్ కప్ చరిత్రలోనే 6 వేర్వేరు ఎడిషన్లలో ఆడి, స్కోర్ చేసిన ఏకైక ఆటగాడిగా రొనాల్డో రికార్డు సృష్టించాడు, మెస్సీ మాదిరిగా వరల్డ్ కప్ ట్రోఫీని ముద్దాడాలనే అతని కల కలగానే మిగిలిపోయింది,

1-0-Merino-Goal : పోర్చుగల్‌కు బ్యాడ్ లక్

మొదటి అర్ధభాగంలో కనిపించిన పోర్చుగల్​ ఆధిపత్యం కాస్త దురదృష్టంగా మారిపోయింది. తొలి 15 నిమిషాలు: మ్యాచ్ ప్రారంభం కాగానే ఇరు జట్లు బంతిని తమ ఆధీనంలో ఉంచుకోవడానికి ప్రయత్నించాయి స్పెయిన్ తమ సాంప్రదాయ ‘టికి-టాకా’ (షార్ట్ పాసెస్) శైలితో పోర్చుగల్ డిఫెన్స్‌ను చేధించాలని చూసింది 28వ నిమిషంలో పోర్చుగల్ డిఫెండర్ నునో మెండిస్ ఎడమ వైపు నుండి దూసుకొచ్చి డి-బాక్స్ వెలుపల నుండి ఒక శక్తివంత లాంగ్-రేంజ్ షాట్ కొట్టాడు , అది స్పెయిన్ గోల్​ కీపర్​ పెడ్రో పోర్రోను తాకుతూ వెళ్లి, గోల్ పోస్ట్ పైభాగాన క్రాస్‌బార్‌ ను తాకి వెనక్కి వచ్చేసింది ఇలా పోర్చుగల్‌కు లభించిన అత్యుత్తమ అవకాశం చేజారింది పోర్చుగల్​ స్టార్​ క్రిస్టియానో రొనాల్డోను స్పెయిన్ డిఫెండర్లు పూర్తిగా లాక్ చేశారు . ఆయనకు బంతి అందకుండా గట్టి నిఘా పెట్టడంతో మొదటి హాఫ్ ముగిసేసరికి స్కోరు 0-0 గా నమోదైంది రెండో అర్ధభాగంలో స్పెయిన్ ఎదురుదాడి ప్రారంభిచంగా గోల్​ కీపర్​ కోస్టా .. మరో వై‌‌పు పోర్చుగల్​ జట్టుకు అడ్డుగోడగా నిలిచాడు. 62వ నిమిషంలో స్పెయిన్ సంచలన యంగ్ ప్లేయర్ లామిన్ యమల్ వింగ్ నుండి ఇద్దరు డిఫెండర్లను ముగ్గులోకి దించి గోల్ వైపు క్లోజ్-రేంజ్ షాట్ కొట్టాడు . కానీ పోర్చుగల్ గోల్‌కీపర్ డియోగో కోస్టా అద్భుత డైవ్‌తో దాన్ని ఆపేశాడు 75వ నిమిషంలో మ్యాచ్ ఎక్స్‌ట్రా టైమ్‌కు వెళ్లేలా కనిపించడంతో స్పెయిన్ కోచ్ లూయిస్ డి లా ఫ్యూయెంటె మిడ్‌ఫీల్డ్‌ను బలోపేతం చేయడానికి అల్వారో మొరాటా, మైకెల్ మెరీనోలను మైదానంలోకి దించారు 84వ నిమిషం లో స్పెయిన్ మిడ్‌ ఫీల్డర్ అలెక్స్ బేనా కొట్టిన ఫ్రీ-కిక్ నేరుగా నెట్‌లోకి వెళ్తుండగా కోస్టా మరోసారి పంచ్ చేసి బంతిని బయటకు పంపాడు ఇంజూరీ టైమ్ మ్యాజిక్ (90+1వ నిమిషం)నిర్ణీత 90 నిమిషాలు ముగిసేసరికి ఇరు జట్లు గోల్స్ చేయలేకపోయాయి రెఫరీ 4 నిమిషాల అదనపు సమయాన్ని ప్రకటించారు , సరీగా 91వ నిమిషంలో స్పెయిన్ రైట్ వింగ్ నుండి ఫెర్రాన్ టోర్రెస్ బాక్స్ లోపలికి ఒక లో-క్రాస్ పాస్ ఇచ్చాడు . అక్కడ సిద్ధంగా ఉన్న సబ్‌స్టిట్యూట్ ప్లేయర్ మైకెల్ మెరీనో ఎలాంటి తప్పు చేయకుండా, డిఫెండర్లను బోల్తా కొట్టిస్తూ బంతిని గోల్ పోస్ట్ కుడి మూలలోకి నెట్టాడు . అంతే స్పెయిన్ ఆటగాళ్లు, అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు చివరి 3 నిమిషాలు పోర్చుగల్ కోచ్ రాఫెల్ లియావోను ముందుకు నెట్టి, రొనాల్డోతో కలిసి ఆల్‌అవుట్ ఎటాక్ చేశారు, 93వ నిమిషంలో పోర్చుగల్‌కు ఒక కార్నర్ కిక్ లభించింది, గోల్‌కీపర్ కోస్టా కూడా హెడర్ గోల్ కోసం స్పెయిన్ బాక్స్‌లోకి వచ్చాడు అయితే స్పెయిన్ డిఫెండర్ అయ్మెరిక్ లాపోర్టే బంతిని హెడర్ ద్వారా సురక్షితంగా క్లియర్ చేశాడు. ఇంకేముంది.. పోర్చుగల్​ కన్నీటి ఇంటి ముఖం పట్టక తప్పలేదు.