బాధితుడికి ఎల్ఓసీ అందజేత
భవానిపురం, ఆంధ్రప్రభ: ఎమ్మెల్యే సుజన చౌదరి సౌజన్యంతో ముఖ్యమంత్రి సహాయనిది నుండి మంజూరైన ఎల్ఓసీని ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్,40 వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు పీవీ చిన సుబ్బయ్య, టీడీపీ నాయకులు మన్నం నారాయణ, బీజేపీ నాయకులు దుర్బేసుల హుస్సేన్ కలిసి అందజేశారు. 40 వ డివిజన్ , భవానీపురం కు చెందిన మహమ్మద్ ఖాలీద్ అహ్మద్ (59) నరాల సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు అతనికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులు తెలపడంతో వైద్యం సాయం కోసం దరఖాస్తు చేసుకోగా మంజూరైన రూ 2 లక్షల 55 వేల ఎల్ఓసీని బాధితుడికు అందజేశారు. త్వరితగతిన స్పందించి ఎల్ఓసీని అందజేయడంతో బాధితుడు ఎమ్మెల్యే సుజనాకు కృతజ్ఞతలు తెలిపారు.
