Crime News | అప్పుల కోసం దొంగగా మారిన డ్రైవర్

17 కేసుల నిందితుడు అరెస్ట్

Crime News | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: జల్సాల కోసం చేసిన అప్పులు తీర్చేందుకు వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఆర్టీసీ ప్రైవేట్ డ్రైవర్‌ను నారాయణపేట జిల్లా కోస్గి పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి రూ.6.88 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.

పోలీసుల వివరాల ప్రకారం.. అరెస్టైన నిందితుడిని ఎదుల బాబుగా గుర్తించారు. ఆర్టీసీకి ప్రైవేట్ డ్రైవర్‌గా పనిచేస్తున్న అతడు విలాసవంతమైన జీవనం కోసం చేసిన అప్పులు తీర్చేందుకు దొంగతనాలను మార్గంగా ఎంచుకున్నట్లు విచారణలో వెల్లడైంది.

నిందితుడిపై ఇప్పటికే 17 దొంగతనాల కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. అతని నుంచి రూ.6.88 లక్షల నగదును స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

జిల్లాలో ఇటీవల జరిగిన చోరీలపై దర్యాప్తు చేపట్టిన కోస్గి పోలీసులు సాంకేతిక ఆధారాలు, నిఘా సమాచారంతో నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.