కేజీ వీల్స్‌తో రోడ్డుపై ట్రాక్టర్లు నడిపితే కేసులు: ఎస్‌ఐ హెచ్చరిక

పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ: పంట పొలాలు దున్నేందుకు ఉపయోగించే కేజీ వీల్స్‌తో రహదారులపై ట్రాక్టర్లు నడిపితే కేసు నమోదు చేయడంతో పాటు జరిమానా విధిస్తామని పెద్దపల్లి రూరల్ ఎస్‌ఐ మధుకర్ హెచ్చరించారు.

సోమవారం పెద్దపల్లి మండలం నిట్టూరు గ్రామం వద్ద రహదారిపై కేజీ వీల్స్‌తో వెళ్తున్న ట్రాక్టర్‌ను రూరల్ పోలీసులు పట్టుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం ట్రాక్టర్‌ను తహసీల్దార్ కార్యాలయానికి అప్పగించారు.

కేజీ వీల్స్‌తో ట్రాక్టర్ నడిపిన యజమానికి రూ.5 వేల జరిమానా విధించినట్లు ఎస్‌ఐ తెలిపారు. మరోసారి ఇదే విధంగా పట్టుబడితే కేసు నమోదు చేయడంతో పాటు రూ.25 వేల జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ఈ తనిఖీల్లో ఎస్‌ఐ మధుకర్‌తో పాటు ఏఏఎస్‌ఐ తిరుపతి, హెడ్ కానిస్టేబుల్ ఆనంద్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.