ఘనంగా ఆలేరులో శ్యాంప్రసాద్ ముఖర్జీ జయంతి

ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గ కేంద్రంలోని బిజెపి కార్యాలయంలో భారతీయ జన సంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ జయంతి సోమవారం జరిగింది. నాయకులు, కార్యకర్తలు శ్యాంప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో బిజెపి పట్టణ ప్రధాన కార్యదర్శి ఎలగల వెంకటేష్, మున్సిపల్ 5 వ వార్డ్ కౌన్సిలర్ పాశికంటి సంపత్,జిల్లా పార్టీ కార్యదర్శి కామిటికారి కృష్ణ,, జిల్లా పార్టీ కౌన్సిల్ మెంబర్ వడ్డమాన్ నరేందర్, సీనియర్ నాయకులు చిలుగురి నర్సిరెడ్డి, సముద్రాల( ఐడియా) శ్రీనివాస్, బందేల విష్ణు, పట్టణ కిసాన మోర్చా అధ్యక్షుడు పూల హనుమంతు , బీజేవైఎం జిల్లా నాయకులు కంతుల శంకర్, ఓబీసీ మోర్చా పట్టణ అధ్యక్షుడు ఎగ్గిడి సంపత్, ఐలి సందీప్, మండల కార్యదర్శి బైరి మహేందర్, గౌడ్,బూత్ అధ్యక్షుడు గుర్రం నరసింహులు పాల్గొన్నారు.