సూర్యాపేట ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం బదిలీ..
సూర్యాపేట, ఆంధ్రప్రభ: సూర్యాపేట ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం బదిలీ అయ్యారు. జిల్లా ఎస్పీ నరసింహ ఆదేశాల మేరకు సోమవారం ఆయన సీసీఎస్‌కు బదిలీపై వెళ్లారు.
జిల్లా కేంద్రంగా అభివృద్ధి చెందిన సూర్యాపేట పట్టణంలో పెరుగుతున్న ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు సాయిరాం ప్రత్యేక చర్యలు చేపట్టారు. రహదారుల వెంట ఆక్రమణల తొలగింపు, రద్దీ ప్రాంతాల్లో స్పీడ్ బ్రేకర్ల ఏర్పాటును పర్యవేక్షించడం వంటి చర్యలతో ట్రాఫిక్ నిర్వహణకు ప్రాధాన్యం ఇచ్చారు.
సాయిరాం స్థానంలో సీసీఎస్‌లో విధులు నిర్వహిస్తున్న యాదవేందర్ రెడ్డి ట్రాఫిక్ ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా బదిలీపై వెళ్తున్న సాయిరాంను పలువురు అభినందించి, ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
