పాఠశాలకు మాజీ ఎంపీటీసీ గ్యాస్ సిలిండర్ విరాళం..
ఉట్నూర్, ఆంధ్రప్రభ : అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని సాలె వాడ(కే) జిల్లా పరిషత్ పాఠశాలలో కట్టెల పొయ్యి మీద వంటలు చేయడానికి ఇబ్బంది చూసి మాజీ ఎంపిటిసి సల్గర్ రవీందర్ సోమవారం గ్యాస్ పొయ్యి విరాళంగా ఇచ్చి ఆయన ప్రారంభించారు. కట్టెల పొయ్యి ద్వారా ఇబ్బందులను గమనించి తన వంతుగా సహాయం చేశానని ఆయన తెలిపారు. గ్యాస్ పొయ్యి విరాళం ఇవ్వడంతో పాఠశాల ఉపాధ్యాయులు మాజీ ఎంపీటీసీ సల్గర్ రవీందర్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు మనోజ్ రెడ్డి, ఉపాధ్యాయురాలు జాదవ్ సంగీత, సిఆర్టి దేవదాస్ కౌసుబాయి,దేవరావ్ పాల్గొన్నారు.
