అసిస్టెంట్ కలెక్టర్ ఆకస్మిక తనిఖీ..

10వ డివిజన్ సచివాలయంలో రికార్డుల పరిశీలన

మచిలీపట్నం, ఆంధ్రప్రభ : మచిలీపట్నంలోని 10వ డివిజన్ సచివాలయాన్ని అసిస్టెంట్ కలెక్టర్ నమ్రత అగర్వాల్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సచివాలయంలో నిర్వహిస్తున్న వివిధ శాఖల రికార్డులను ఆమె క్షుణ్ణంగా పరిశీలించి, వాటి నిర్వహణ తీరుపై ఆరా తీశారు. ప్రజలకు అందిస్తున్న సేవలు, దరఖాస్తుల పరిష్కార విధానం, రికార్డుల నిర్వహణపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సచివాలయ పరిధిలో ఇటీవల నిర్మాణంలో ఉన్న నూతన భవనాల ప్లాన్ అనుమతుల (బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్స్) వివరాలను పరిశీలించారు. నిబంధనల మేరకు నిర్మాణాలు చేస్తున్నారా? అని పరిశీలించారు.