సాగునీరు కిందకు విడుదలయ్యేలా చర్యలు
సాగునీరు కిందకు విడుదలయ్యేలా చర్యలు
పీసీ చైర్మన్ దేవనబోయిన వెంకటేశ్వరరావు
ఘంటసాల, ఆంధ్రప్రభ: కొద్దిరోజుల్లో ప్రకాశం బ్యారేజీ నుంచి దిగువకు సాగునీటిని విడుదల చేయనున్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు ప్రాజెక్టు కమిటీ చైర్మన్ దేవనబోయిన వెంకటేశ్వరరావు తెలిపారు.
మంగళవారం మెయిన్ కెనాల్ శ్రీకాకుళం పరిధిలో గుర్రపు డెక్క, తూటుకాడ ఉన్న ప్రాంతాల్లో మందు పిచికారీ చేశారు. ఈ పనులను దేవనబోయిన వెంకటేశ్వరరావు పరిశీలించారు.
సాగునీటి ప్రవాహానికి అడ్డంకులు లేకుండా కాలువల్లో పెరిగిన గుర్రపు డెక్క, తూటుకాడ తొలగింపు పనులు వేగంగా చేపడుతున్నట్లు ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం డిస్ట్రిబ్యూటరీ కమిటీ వైస్ చైర్మన్ సుగ్గన రాంబాబు, పులిగడ్డ సబ్ డివిజన్ డీఈ గణపతి, ఏఈ ప్రసాద్, లస్కర్లు పాల్గొన్నారు.
