ORR | లారీని ఢీకొట్టిన కారు.. ఒకరి మృతి

ORR | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: హైదరాబాద్ శంషాబాద్ సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్)పై ఇవాళ ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పెద్దగోల్కొండ వద్ద ఎగ్జిట్-15 సమీపంలో వేగంగా వస్తున్న ఓ కారు ముందువెళ్తున్న లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఒకరు అక్కడికక్కడే మృతిచెందారు. మహిళ, చిన్నారితో పాటు మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ప్రమాద తీవ్రతకు కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. ఘటనతో కొంతసేపు ఓఆర్ఆర్‌పై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడగా, పోలీసులు చేరుకుని వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. మృతుడి వివరాలు, క్షతగాత్రుల వివరాలు తెలియాల్సి ఉంది.