కాళేశ్వరం వైఫల్యంపై ప్రజలకు క్షమాపణ చెప్పాలి

  • వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి

హనుమకొండ, ఆంధ్రప్రభ : మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వృథా చేశారని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి ఆరోపించారు. ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యంపై ముందుగా తెలంగాణ ప్రజలకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

కాళేశ్వరం పర్యటనకు వెళ్లే ముందు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ఉందన్నారు. కుటుంబ వ్యవహారాల్లోనే వివాదాలు ఎదుర్కొంటున్న వ్యక్తి ప్రజలకు ఏం సమాధానం చెబుతారని కేటీఆర్‌ను ఉద్దేశించి ప్రశ్నించారు.

కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు ప్రభుత్వం అనుమతి ఇచ్చినందున వెళ్లవచ్చని, అయితే వాస్తవాలను ఎదుర్కొనే ధైర్యం కూడా ఉండాలని నాయిని రాజేందర్‌రెడ్డి పేర్కొన్నారు.