తెలంగాణ, కర్నాటకలో కాంగ్రెస్ భవితవ్యం.. మళ్లీ గెలిస్తేనే మనుగడ!
2014 తర్వాత కాంగ్రెస్ రాజకీయ ప్రయాణం
తెలంగాణలో కాంగ్రెస్‌కు అవకాశాలు, సవాళ్లు
కర్నాటకలో అధికార వ్యతిరేకత, బీజేపీ వ్యూహం
గాంధీ కుటుంబానికి తెలంగాణ-కర్నాటకల ప్రాధాన్యం
కాంగ్రెస్ పార్టీ 2014లో కేంద్రంలో అధికారం కోల్పోయింది. నరేంద్రమోడీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడింది. చాలామంది ఏమనుకున్నారంటే, మోడీకి జాతీయ రాజకీయాల్లో అనుభవం లేదు కనుక, ఏడాది తర్వాత ఆయన దిగిపోతారని.
2019లో భారీ మెజారిటీతో తిరిగి అధికారంలోకి వచ్చారు. దాంతో కాంగ్రెస్కు ఎదురుదెబ్బ తగిలింది. ఆ తర్వాత కాంగ్రెస్ పొత్తులు కుదుర్చుకుని మహారాష్ట్రలోనూ, ఆ తర్వాత 2023 మేలో కర్నాటకలోనూ, అటు పిమ్మట 2023 డిసెంబర్ తెలంగాణలోనూ చెప్పుకోదగిన విజయాలను సాధించింది.
కాంగ్రెస్ ఆశలకు తెలంగాణ, కర్నాటకలు బలమైన కోటలుగా తయారయ్యాయి. తమిళనాడులో ఎంకె స్టాలిన్ నేతృత్వంలోని డిఎంకె ఓటమి పాలయ్యాక, పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ఓడిపోయిన తర్వాత, కాంగ్రెస్ తెలంగాణ, కర్నాటకలపై ఎక్కువ ఆధారపడటం మొదలు పెట్టింది. కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ విజయం కాంగ్రెస్ విజయానికి గేమ్ ఛేంజర్ కాదు.
తెలంగాణ:
2023వరకూ కేసీఆర్ ప్రభుత్వం రెండు పర్యాయాలు తెలంగాణలో అధికారంలో ఉంది. 2023 డిసెంబర్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం గాంధీ కుటుంబానికి పెద్ద అండ చేకూరింది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాతీయ స్థాయిలో కాంగ్రెస్ సమస్యల పరిష్కారానికి పెద్ద దిక్కుగా తయారయ్యారు. ఆయన వ్యక్తిత్వం, విలక్షణమైన రాజకీయ, ఆర్థిక పరిస్థితి జాతీయ స్థాయిలో కాంగ్రెస్కు ఎంతో దోహదం చేసింది.
తెలంగాణలో కాంగ్రెస్ సమస్యలు:
కాంగ్రెస్ జాతీయ పార్టీ కావడం వల్ల కేంద్రంలో కాంగ్రెస్ నాయకత్వం జోక్యం తరచు అనివార్యం అవుతూ ఉంటుంది. దాంతో ముఖ్యమంత్రి స్థాయికి భంగం కలుగుతున్నది. అసోంలోనూ, ఇతర బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులకు పూర్తి స్వేచ్ఛ ఉండటం వల్ల వారు విజయాలను సాధించగలుగుతున్నారు. తెలంగాణలో రేవంత్ రెడ్డికి అటువంటి స్వేచ్ఛ లేదు.
అంతేకాక, ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో ప్రజలకు కేంద్ర కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు ఇచ్చింది. వీటి వల్ల కాంగ్రెస్ ఏమాత్రం లాభం చేకూరడం లేదు. ఆర్థిక సమస్యలే కాకుండా, ఈ గ్యారంటీలలో కొన్ని రాజకీయంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం ప్రయోజనకరంగా లేవు.
ఇది కాక, బలవంతంగా కులగణనను రుద్దడం వల్ల తెలంగాణలో కనిపించని చీలికలు ఏర్పడ్డాయి. ఈ ప్రయోగం బీహార్లో విఫలమైంది.
అయితే, తెలంగాణలో కాంగ్రెస్కు ఉన్న ప్రయోజనం ఏమిటంటే, కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్, బీజేపీల భిన్నధోరణులు. కాంగ్రెస్కు ఈ రెండింటి వల్ల ప్రయోజనం ఉంటోంది.
కర్నాటక:
కర్నాటకలో ముఖ్యమంత్రి డికె శివకుమార్ సమర్థుడైన రాజకీయవేత్త. 2014 నుంచి కాంగ్రెస్కు ఏ సమస్య వచ్చినా పరిష్కరిస్తూ వస్తున్నారు. 2014లో కాంగ్రెస్ అధికారాన్ని కోల్పోయిన తర్వాత పార్టీకి పెట్టని కోటగా ఉన్నారు. 2023లో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే వరకూ పార్టీకి అండగా ఉన్నారు.
శివకుమార్‌కీ, కాంగ్రెస్కీ గడిచిన 45 సంవత్సరాల్లో ఏకైక సమస్య ఏమిటంటే, ఏ పార్టీ కూడా రెండోసారి గెలవలేదు. తెలంగాణలో కులగణనను కాంగ్రెస్ నాయకత్వం రుద్దింది. దాంతో సమాజంలో చీలికలు వచ్చాయి. అటువంటి సామాజిక ప్రయోగాలు ఎన్నికల్లో అరుదుగా విజయాన్ని తెచ్చిపెడతాయి. అధికారంలో ఉన్న ప్రభుత్వం ఏకీకృతంగా ఉండాలి.
కర్నాటకలో కూడా కాంగ్రెస్ వాగ్దానం చేసిన గ్యారంటీలు పాక్షికంగా ప్రజామోదం చెందాయి. అయితే, ప్రభుత్వం మౌలిక సదుపాయాల కోసం ఇతర ప్రాధాన్యాల కోసం చేయవలసిన నిధులను మళ్లించాల్సి వచ్చింది. బీజేపీ గట్టి ప్రతిపక్షంగా ఉంది. క్రమశిక్షణ గల పార్టీగా పేరొందింది. లింగాయత్ సామాజిక వర్గంలో మంచి పలుకుబడి కలిగి ఉంది. 2023లో ఆ వర్గం ఎన్నికల్లో దెబ్బతిన్నప్పటికీ, తిరిగి అధికారంలోకి వచ్చేందుకు ఆ పార్టీ పట్టు కలిగి ఉంది.
జనతా (సెక్యులర్) పార్టీ బలహీనమైన పార్టీ అయినప్పటికీ, మైసూరు ప్రాంతంలో పలుకుబడి కలిగి ఉంది.
కర్నాటక కాంగ్రెస్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. అయితే, బీజేపీలో పెద్ద నాయకుడు ఎవరూ లేకపోవడం కాంగ్రెస్కి కలిసొచ్చే అంశం. మోడీ ప్రతిష్ట, ఇమేజ్ బీజేపీకి అండగా ఉన్నాయి. అందువల్ల కాంగ్రెస్ శివకుమార్‌పైనా, బీజేపీ బలహీనతలపైనా ఎక్కువ ఆధారపడుతోంది.
కర్నాటకలో ప్రభుత్వంపై వ్యతిరేకత ఎక్కువగా ఉంది. అయితే, ప్రతిపక్షమైన బీజేపీలో సరైన, బలమైన నాయకుడు లేకపోవడం కాంగ్రెస్కు కలిసొచ్చే అంశం. మోడీ ప్రతిష్ట, ఇమేజ్ ఆ పార్టీకి బలం.
తెలంగాణ, కర్నాటకలతో గాంధీ కుటుంబం బంధం
2014లో కేంద్రంలో కాంగ్రెస్ ఓడిపోయిన తర్వాత బెంగాల్, ఉత్తరాది రాష్ట్రాల్లో కాంగ్రెస్ బలం కోల్పోయింది. ఈ రెండు రాష్ట్రాలు కాంగ్రెస్ తిరిగి రాజకీయాల్లో తన శక్తిని నిరూపించుకోవడానికి అవకాశాన్ని కల్పించాయి. ఈ రెండు రాష్ట్రాల్లో విజయంతో కాంగ్రెస్ తిరిగి కోలుకుంది.
కేరళ, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఉన్నప్పటికీ, వారి బలం ఆయా రాష్ట్రాలకే పరిమితం.
కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే, కులగణనను అమలు జరిపిస్తామని వాగ్దానం చేశారు. కాంగ్రెస్లో అధిష్టానం పరిశీలకులను నియమిస్తుంది. వారు వచ్చి ముఖ్యమంత్రులకు సమస్యలను తెచ్చిపెడతారు. వారి పర్యవేక్షణ వల్ల పార్టీ దెబ్బతింటోంది. ఈ రెండు రాష్ట్రాలలో ముఖ్యమంత్రులు సమర్థులే అయినప్పటికీ, అధిష్టానం జోక్యం వల్ల వారు పని చేయలేకపోతున్నారు.
ఇండియా కూటమిలో మమతా బెనర్జీ, శరద్ పవార్, ఉద్ధవ్ థాకరే, వామపక్షాలు, డీఎంకే ఇప్పటికే కాంగ్రెస్కు దూరంగా ఉంటున్నాయి. తెలంగాణ, కర్నాటకలలో కాంగ్రెస్ ఓటమి పాలైతే ఆ పార్టీ పరిస్థితి ఘోరంగా ఉంటుంది. ఇప్పటి నుంచి ఈ రెండు రాష్ట్రాల్లో పరిస్థితిని సరిదిద్దుకుని కాంగ్రెస్ ముందుకు సాగితే మంచి పోటీ ఇవ్వగలుగుతుంది.
కాంగ్రెస్కు ఢిల్లీలోని నాయకులే పెద్ద అవరోధంగా తయారయ్యారు. వారి జోక్యం వల్లే కాంగ్రెస్ దెబ్బతింటోంది. తమిళనాడులో సినీనటుడు, మెగాస్టార్ విజయ్ ఘనవిజయంతో ప్రజల నాడి తెలిసింది. పాతకాలపు నాయకులను, వంశపారంపర్య పార్టీల నాయకులను వారు తోసిరాజంటున్నారు. ఈ స్థితిలో కాంగ్రెస్ మరింత జాగ్రత్తగా ఉండటం అవసరం. బీజేపీకి వ్యూహమే లేదు. ఈ రెండు రాష్ట్రాల్లో ఆ పార్టీకి చాణక్యులు అవసరం ఎంతైనా ఉంది.
డా. పెంటపాటి పుల్లారావు
