AP Police | 9 మంది డీఎస్పీలకు పదోన్నతి
పోలీసు శాఖలో కీలక పదోన్నతులు
AP Police | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు శాఖలో 9 మంది డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ)లకు అదనపు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (అదనపు ఎస్పీ) హోదాకు పదోన్నతి లభించింది. ఈ మేరకు సంబంధిత అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
పదోన్నతి పొందిన అధికారుల్లో ఎం. రాజగోపాల్ రెడ్డి, పి. శ్రీకాంత్, టి. శ్రీనివాసులు, జి. శివప్రభాకర్ రెడ్డి, డి. సోమన్న, ఏఎస్ చక్రవర్తి, ఎం. అంబికాప్రసాద్, ఎస్. వాసుదేవ్, ఏ. నరసింహమూర్తి ఉన్నారు.
పదోన్నతి పొందిన ఈ అధికారులంతా వెంటనే మంగళగిరిలోని రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో (పోలీస్ హెడ్‌క్వార్టర్స్) రిపోర్ట్ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అనంతరం వారికి కొత్త పోస్టింగ్‌లు కేటాయించే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి.
