రైతు సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట: బొడ్డు గంగన్న
కడెం, ఆంధ్రప్రభ: కడెం మండల కేంద్రంలో రైతు భరోసా నిధుల జమ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.
కడెం మండలంలోని ఇందిరాగాంధీ విగ్రహం వద్ద జరిగిన ఈ కార్యక్రమాన్ని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొడ్డు గంగన్న ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జు పటేల్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా జిల్లా, మండల కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. రైతు భరోసా నిధుల జమ, రూ.2 లక్షల వరకు రుణమాఫీ, ఉచిత విద్యుత్, సాగునీటి ప్రాజెక్టులకు నిధుల కేటాయింపు వంటి పథకాలు రైతుల అభివృద్ధికి దోహదపడుతున్నాయని తెలిపారు. రైతులకు ఇచ్చిన ప్రతి హామీని కాంగ్రెస్ ప్రభుత్వం దశలవారీగా అమలు చేస్తోందని, రైతు సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వారు స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి, ఆర్టీఏ సభ్యులు మల్లేశ్ యాదవ్, ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షుడు కట్ట శ్యామ్, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు బరుపటి రమేష్, జిల్లా యూత్ కాంగ్రెస్ కార్యదర్శి ముడికే మల్లేష్ యాదవ్, వివిధ గ్రామాల సర్పంచులు తాళ్లపల్లి రమేష్, బాణావత్ రాజు, తోడసం సీతారాం, ఈదుల తిరుపతి, గుంతల లక్ష్మీ, భూమున యాదవ్, వెడమ జంగు, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు ముస్కు రాజేందర్ రెడ్డి, జడ రాజేశ్వర్, ఎండి సలీం, దూల్లే వెంకటేష్, మాలవత్ దాసు నాయక్, ముంజా ప్రసాద్ గౌడ్, లచ్చన్న, రమేష్, డి. రాజశేఖర్, ధర్మయ్య, తరిశంకర్, బాబ్లూ, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
