విశ్వనాథ ఆలయ చైర్మన్ పదవి బిసి వర్గానికి కేటాయించాలి

  • బీసీ సమాజ్ రాష్ట్ర కార్యదర్శి నరెడ్ల శ్రీనివాస్ డిమాండ్

మంచిర్యాల, ఆంధ్రప్రభ : మంచిర్యాల పట్టణంలోని విశ్వనాథ ఆలయ పాలకవర్గ చైర్మన్ పదవిని బీసీ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థికి కేటాయించాలని బీసీ సమాజ్ రాష్ట్ర కార్యదర్శి నరేడ్ల శ్రీనివాస్ డిమాండ్ చేశారు.ఈ ఆలయం దేవాదాయ శాఖ పరిధిలోకి వచ్చినప్పటి నుండి నేటి వరకు ఒక్క బీసీ సామాజిక వర్గానికి చెందిన వారికి అధికారం దక్కలేదని దామాషా ప్రకారం మంచిర్యాల నియోజకవర్గంలో మెజారిటీ సభ్యులుగా ఉన్నటువంటి బీసీలను దశాబ్దాల కాలం నుండి అనగా ద్రోక్కుతున్నారని ఏ పార్టీ నుండి ఎమ్మెల్యేగా గెలుపొందిన అగ్రవర్ణాలకు ఈ పదవిని కట్టబెడుతూ వారి డబ్బుకు దాసోహం అవుతున్నారని విమర్శించారు.

ఇదే ఆనవాయితీ కొనసాగుతూ ఉండడం బీసీలపై జరుగుతున్న వివక్షకు నిదర్శనమని అన్నారు. మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో ఆలయ చైర్మన్ గా ఉండే అర్హత ఏ ఒక్క బీసీకి లేదా అని ప్రశ్నించారు. ఒక వర్గానికి చెందిన సభ్యులను చైర్మన్గా ప్రకటించడం సామాజిక న్యాయానికి విరుద్ధమని ఇన్నేళ్లుగా ఒక సామాజిక వర్గానికి చెందినవారు చైర్మన్గా ఉంటున్నప్పటికీ ఆలయం ఆశించిన స్థాయిలో అభివృద్ధి చెందలేదని అన్నారు.

ఇప్పటికైనా విశ్వనాథ ఆలయ పాలకవర్గాన్ని బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలకు సముచిత ప్రాతినిధ్యంతో ఏర్పాటుచేసి పాలకవర్గ చైర్మన్ పదవిని అత్యధిక జనాభా కలిగిన బీసీ సమాధిక వర్గానికి కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. లేదంటే ఎస్సీ, ఎస్టీ బీసీ సామాజిక వర్గాల కు చెందిన భక్తులు ఆలయానికి దూరమయ్యే పరిస్థితి మరింత తీవ్రతరం అవుతుందని ఇదే పరిస్థితి కొనసాగితే ఆలయ అభివృద్ధి పూర్తిగా ప్రమాదం ఉందని హెచ్చరించారు.